Betting Apps Case: బెట్టింగ్ యాప్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకోనున్నది. అందరూ గత కొన్నాళ్లుగా అనుకుంటున్నట్టుగానే టాలీవుడ్‌ను షేక్ చేసేలా ఆ పరిణామం ఉండబోతున్నది. ప్రముఖ సినీనటులైన బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్‌లు బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేశారంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు వారిపై విచారణ జరిగే అవకాశం ఉన్నది. దీంతో పోలీసులు వదిలినా, సామాన్యులు వదిలేలా లేదనే విషయం బోధపడుతున్నది.
Betting Apps Case: ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని సుమారు 25 మందికి పైగా సినీనటులు, యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్లపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. వారిపై విచారణ కొనసాగుతున్నది. ఏకంగా విదేశాలకు పారిపోయాడనే కారణంతో బయ్య సన్నీయాదవ్‌పై పోలీసులు లుకౌట్ నోటీసులనే జారీ చేశారు. ఈ దశలో పోలీసులు ఈ కేసును పకడ్బందీగా విచారణ జరుపుతున్నారని తెలుస్తున్నది.
Betting Apps Case: ఇదే సమయంలో రామారావు అనే వ్యక్తి సైబర్ పోలీసులను ఆశ్రయించారు. ప్రభాస్, బాలకృష్ణ, గోపీచంద్ ముగ్గురూ ఓ బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. వారి ప్రమోషన్ ద్వారా లక్షలాది మంది డబ్బు పోగొట్టుకున్నారని, మ్యూల్ ఖాతాల నుంచి చైనీయులకు ఆ నగదు చేరిందని తన ఫిర్యాదులో రామారావు పేర్కొన్నారు. ఆయన ఇచ్చిన తాజా ఫిర్యాదుపై పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.