Betting App Case:బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక అప్‌డేట్ సమాచారం అందింది. ఈ కేసును విచారిస్తున్న తెలంగాణ సీఐడీ ఓ ముఖ్య ఆపరేషన్‌ను చేపట్టింది. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లోని ఆరు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి, అందుకు బాధ్యులైన 8 మందిని అరెస్టు చేసింది. వీరంతా బెట్టింగ్ యాప్‌లను నిర్వహిస్తూ దేశవిదేశాల్లో వివిధ ప్రాంతాలకు చెందిన వారితో అక్రమాలకు పాల్పడుతున్నట్టు సీఐడీ అధికారులు గుర్తించారు.
Betting App Case:తాజాగా 007, ఫెయిర్ ప్లేలైవ్, ఆంధ్ర 365 బెట్టింగ్, వీఎల్ బుక్, తెలుగు 365, ఎస్ 365 యాప్‌లను ఈ ముఠాలు నిర్వహిస్తున్నాయని సమాచారం. ఇప్పటికే బెట్టింగ్ యాప్‌లపై ప్రమోషన్ నిర్వహించిన సినీ ప్రముఖులు, ఇన్‌ఫ్లుయెన్సర్లను అదుపులోకి తీసుకొని సీఐడీ అధికారులు విచారణ జరిపారు. వారి నుంచి తగిన సమాచారం తీసుకున్నారు. ఆ మేరకు ఈ తనఖీలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు.
Betting App Case:ముఖ్యంగా బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ లో భాగంగా వారికి వచ్చిన కాల్స్, నగదు రూపేణా వచ్చిన ఖాతాల వివరాలను బట్టి సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. ఈ బెట్టింగ్ యాప్‌ల కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎందరో యువత ప్రాణాలు బలయ్యాయి. మరెందరో అప్పులపాలై ఆస్తిపాస్తులను ఆమ్ముకున్నారు. ఆర్థికంగా చితికి పోయి బికారీలుగా మారిపోయారు. ఇలాంటి బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకులు, ప్రమోషన్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రెండు రాష్ట్రాల ప్రజలు కోరుతున్నారు.