Parigi: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు మరోసారి భగ్గుమన్నది. ఇప్పటికే వివిధ నియోజకవర్గాల్లో గుంబనంగా కుంపటిలా ఉన్న వర్గపోరు ఒక్కసారిగా బహిర్గతమైనది. పీఏసీఎసీ చైర్మన్ ప్రమాణీస్వీకారోత్సవంలో అది ఒక్కసారిగా బయటపడింది. దీంతో వైరి వర్గాలు ఫెక్సీలు చించివేసుకోగా, పోలీసుల అరెస్టు దాకా దారితీసింది.
Parigi: వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవవర్గం పరిధిలోని దోమ మండల పరిధిలోని మోత్కూరు పీఏసీఎస్ చైర్మన్ ప్రమాణస్వీకారోత్సవం దోమలో ఉన్న సొసైటీ కార్యాలయం ఎదుట తొలుత ఏర్పాటు చేశారు. పీఏసీఎస్ నూతన చైర్మన్‌గా ఆగిరాల యాదవరెడ్డి ప్రమాణస్వీకారం చేయాల్సి ఉన్నది. ఈ కార్యక్రమానికి పరిగి ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Parigi: అయితే ఫ్లెక్సీలలో తమ నేతల ఫొటోలు లేవంటూ కాంగ్రెస్ పార్టలోని ఓ వర్గం ఆందోళనకు దిగింది. పోలీసులు చూస్తుండగానే అక్కడి ఫ్లెక్సీలను చించివేయడంతో గందరగోళం నెలకొన్నది. దీంతో కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో ఓటేసి గెలిపిస్తే తమనే అరెస్టు చేయిస్తారా? అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.