Bengaluru: సినిమాలు చూసి దొంగతనాలు చేసిన వాళ్లను చూశాం.. అదే సినిమా సీన్లు చూసి మర్డర్లు, లైంగికదాడులకు పాల్పడిన వాళ్లను చూశాం.. నిజాయితీగా బతికిన వాళ్లను చూశాం.. నిర్భయంగా దారి చూసుకున్నవాళ్లనూ చూశాం.. కానీ, ఓ వెబ్ సిరీస్‌ను చూసిన ఓ బాలుడు ఏకంగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది కర్ణాటక రాష్ట్ర రాజధాని నగరమైన బెంగళూరులో చోటుచేసుకున్న ఘటన చోటుచేసకున్నది.
Bengaluru: మ్యుజీషియన్ గణేశ్, సింగర్ సవిత దంపతుల కొడుకైన గంగాధర్ (14) డెత్ నోట్ అనే జపాన్ వెబ్ సిరీస్‌ను తన ఇంటిలోనే చూశాడు. ఆ వెబ్ సిరీస్‌ను చూస్తూ అందులోనే లీనమయ్యాడు. చూస్తూనే తన గదిలోకి వెళ్లాడు. అక్కడే ఉన్న తన గిటార్ స్ప్రింగ్‌తో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వెబ్ సిరీస్ చూసి 14 ఏళ్ల బాలుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకొన్న ఘటన కలకలం రేపింది.
Bengaluru: బాలుడు గంగాధర్ ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాసి పెట్టడం సంచలనంగా మారింది. ఇక నేను వెళ్లే సమయం ఆసన్నమైంది. మీరు లేఖ చదివే సమయానికి నేను స్వర్గంలో ఉంటాను.. అని గంగాధర్ ఆ లేఖలో పేర్కొన్నాడు. ఆ వెబ్ సిరీస్‌లో ఉన్న అంశాలను బట్టి జీవితంపై విరక్తి చెంది ఉంటాడని అందరూ భావిస్తున్నారు. పోలీసులు విచరాణ చేపడుతున్నారు. ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు ఇంకా వెల్లడించలేదు.