Bilva Patra Benefits: బిల్వ పత్రం.. శివుడికి అత్యంత ప్రీతికరమైనది. ఇది పూజకే పరిమితం కాకుండా ఎన్నో పోషకాలతో నిండి ఉంటుంది. ఇందులో విటమిన్ ఎ, సి, బి1, బి6 ఉంటాయి. అంతే కాకుండా ఇందులో క్యాల్షియం, ఫైబర్ కూడా ఉంటాయి. ఇంట్లో ఈ మొక్క ఉంటే అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు గుడ్ బై చెప్పవచ్చు. ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఈ ఆకును సేవించడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఇది గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి బిల్వపత్రాన్ని సేవించడం వల్ల ఎలాంటి లాభాలు పొందవచ్చు. ఇది ఆరోగ్యాన్ని ఎలా కాపాడుతుంది? ఇప్పుడు తెలుసుకుందాం..
బిల్వపత్రంలో మంచి పీచుపదార్థం ఉండటం వల్ల జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారు ప్రతిరోజూ దీన్ని తింటే మంచి ఫలితాలు ఉంటాయి. బిల్వపత్రంలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇది గుండెను వ్యాధుల నుండి కాపాడుతుంది. గుండెను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.
ఈ బిల్వపత్రం మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా వరం. ఈ ఆకును ఉదయాన్నే పరగడుపున తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇందులోని పీచు, ఇతర పోషకాలు మధుమేహ రోగులకు మేలు చేస్తాయి.
ఈ ఆకులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన వెంటనే ఖాళీ కడుపుతో రెండు లేదా మూడు ఆకులను బాగా నమలడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు వంటి సమస్యలు దూరమవుతాయి.
పైల్స్‌తో బాధపడేవారు ఖాళీ కడుపుతో బిల్వపత్రాన్ని తినడం వల్ల మేలు జరుగుతుంది. ఈ ఆకులు జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తాయి కాబట్టి ఇది కడుపు సంబంధిత సమస్యలను నయం చేయడంలో సహాయపడుతుంది.
ఈ ఆకు చాలా చల్లగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల శరీరం చల్లబడుతుంది. హీట్ స్ట్రోక్ నుండి రక్షిస్తుంది. కాబట్టి ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఈ ఆకులను నమలడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ఆకుల్లో కేలరీలు తక్కువగానూ, పీచుపదార్థాలు ఎక్కువగానూ ఉంటాయి కాబట్టి బరువు పెరగడాన్ని అదుపులో ఉంచుతుంది.
బిల్వపత్రం ఆకులను తీసుకోవడం ద్వారా, ఎసిడిటీ, గ్యాస్, మలబద్ధకం లేదా అజీర్ణం వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ ఆకుల్లో ఫైబర్ ఉంటుంది. ఇది పొట్టను శుభ్రపరుస్తుంది. ఎసిడిటీ నుండి రిలీఫ్ ఇస్తుంది.
బిల్వపత్రం ఆకుల రసం తాగడం వల్ల కిడ్నీ ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులోని పోషకాలు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మూత్ర సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి.

