srikakulam: మందస మండలం సువర్ణపురం గ్రామ సమీపంలో ఉన్న శివాలయంలోకి శుక్రవారం తెల్లవారుజామున మూడు వెలుగుబంట్లు చొరబడ్డాయి. కార్తీక మాసం పౌర్ణమి సందర్భంగా గ్రామంలో ఉన్న భక్తులు తెల్లవారుజామున శివుని దర్శించుకునేందుకు వచ్చేటప్పటికి శివాలయం ఆవరణంలో ఉన్న మూడు ఎలుగుబంట్లను చూసి ఒక్కసారిగా భయాందోళన చెందారు. కాసేపటికి మూడు ఎలుగుబంట్లు సమీపంలో ఉన్న తోటల్లోకి వెళ్లడంతో భక్తులంతా ఊపిరి పీల్చుకొని తమ పూజలను కొనసాగించారు.