india vs Pakistan

india vs Pakistan: హారిస్ రవూఫ్‌, ఫర్హాన్‌పై బీసీసీఐ ఫిర్యాదు

india vs Pakistan: బీసీసీఐ (బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) పాకిస్థాన్ క్రికెటర్లు హారిస్ రవూఫ్ మరియు సాహిబ్జాదా ఫర్హాన్పై ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్)కి అధికారికంగా ఫిర్యాదు చేసింది. ఇటీవల ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఇద్దరు ఆటగాళ్లు రెచ్చగొట్టేలా ప్రవర్తించారని బీసీసీఐ ఆరోపించింది. హారిస్ రవూఫ్ మ్యాచ్ సందర్భంగా బౌండరీ లైన్ వద్ద హారిస్ రవూఫ్ భారత అభిమానులు ‘కోహ్లీ, కోహ్లీ’ అని నినాదాలు చేస్తుండగా, విమానం కూలిపోయినట్లు మరియు ‘6-0’ అని చేతులతో సైగలు చేసి చూపించాడు.

ఈ సంజ్ఞలు భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్థాన్ సైనిక ప్రచారానికి సంబంధించినవిగా భావిస్తున్నారు. ఈ ప్రవర్తన క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని బీసీసీఐ పేర్కొంది. సాహిబ్జాదా ఫర్హాన్ తన అర్ధ సెంచరీ పూర్తయిన తర్వాత బ్యాట్‌ను తుపాకీలా పట్టుకొని కాల్పులు జరిపినట్లు సంబరాలు చేసుకున్నాడు. ఈ చర్య కూడా చాలా మంది భారత అభిమానులకు ఆగ్రహం కలిగించింది. బీసీసీఐ తమ ఫిర్యాదుతో పాటు ఈ ఘటనలకు సంబంధించిన వీడియో ఆధారాలను కూడా ఐసీసీకి సమర్పించింది. ఈ ఆరోపణలను ఖండించినట్లయితే, హారిస్ రవూఫ్ మరియు ఫర్హాన్‌లు ఐసీసీ ఎలైట్ ప్యానెల్ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్ ఎదుట హాజరుకావాల్సి ఉంటుందని సమాచారం.

ఇది కూడా చదవండి: Asia Cup 2025: అభిషేక్‌ విధ్వంసం.. ఫైనల్లో టీమిండియా

దీనికి ప్రతీకారంగా, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కూడా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్పై ఐసీసీకి ఫిర్యాదు చేసింది. పాకిస్థాన్‌తో జరిగిన మొదటి మ్యాచ్ గెలుపును సూర్యకుమార్ యాదవ్ పహల్గామ్ ఉగ్రదాడి బాధితులు మరియు భారత సైన్యానికి అంకితం ఇవ్వడాన్ని పీసీబీ రాజకీయం అని పేర్కొంది. ఈ వివాదంపై ఇరు దేశాల క్రికెట్ బోర్డులు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *