BBL 2024-25 Final: ఆస్ట్రేలియా మేటి టి20 లీగ్ అయిన బిగ్ బాష్ 2025 విజేతగా హోబార్ట్ హరికేన్స్ నిలిచింది. ఏకపక్షంగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సిడ్నీ థందర్స్ పై ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. తమ సొంత మైదానమైన హోబార్ట్ నగరంలో జరిగిన ఈ మ్యాచ్ లో మిచ్ ఓవెన్ అత్యద్భుతమైన సెంచరీ తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే.
టాస్ ఓడి మొదటిగా బ్యాటింగ్ ప్రారంభించిన సిడ్నీ థందర్స్ కు ఓపెనర్లు జేసన్ సంగా, డేవిడ్ వార్నర్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. మొదటి వికెట్ కు వీరిద్దరూ కలిసి కేవలం 10 ఓవర్లలోనే 97 పరుగులు సాధించారు. పవర్ ప్లే ను కూడా ఎంతో బాగా సద్వినియోగపరుచుకుంటూ అలవోకగా పరుగులు సాధించారు. వార్నర్ అర్థ సెంచరీ ముంగిట 48 పరుగులకు అవుట్ కాగా సంగా మాత్రం 67 పరుగులతో సత్తా చాటాడు.
వీరిద్దరి జోడీ మరింత ప్రమాదకరంగా మారుతున్న సమయంలో హోబార్ట్ కెప్టెన్ నాథన్ ఎల్లిస్ వరుసగా రెండు వికెట్లు తీసి వారి జోరుకు అడ్డుకట్ట వేశాడు. ఆ తర్వాత సిడ్నీ చెట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. ఆ ఆరంభానికి 200 పైగా ఉండవలసిన స్కోరుకి బదులుగా హోబార్ట్ జట్టు కేవలం 182 పరుగులతో సరిపెట్టుకుంది. బిల్డింగ్స్, గ్రీన్ ధాటిగా ఆడినప్పటికీ వారు కొద్దిసేపే క్రేజ్ లో నిలవడంతో స్కోరు వేగం మందగించింది. హోబర్ట్ బౌలర్స్ లో ఎల్లీస్, మెరిడిత్… చెరో 3 వికెట్లు మూడు వికెట్లతో సత్తా చాటారు.
ఇది కూడా చదవండి: Jasprit Bumrah: ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా జస్ట్ ప్రీత్ బుమ్రా..!
BBL 2024-25 Final: తమ మొట్టమొదటి బిగ్ బాష్ టైటిల్ కైవసం చేసుకునేందుకు 183 పరుగుల లక్ష్య చేధనకు దిగిన హోబార్ట్ హరికేన్స్ కు ఓపెనర్ ఓవెన్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 16 బంతులకే అర్థ సెంచరీ సాధించిన ఓవెన్.. సిక్స్ లు ఫోర్ లతో ప్రత్యర్థి బౌలర్ల పై సునామీలా విరుచుకుపడ్డాడు. ఇతను దెబ్బకు కేవలం నాలుగు ఓవర్లలోనే హాబార్ట్ జట్టు వికెట్ కోల్పోకుండా 74 పరుగులు చేసింది. అతని జోరును ఆపలేక సిడ్నీ బౌలర్లు నిస్తేజితులయ్యారు.
అయితే తన్వీర్ సంగా ఎనిమిదవ ఓవర్ లో వరుసగా రెండు వికెట్లు తీసినప్పటికీ ఓవెన్ మాత్రం తన జోరుని ఏమాత్రం ఆపలేదు. కేవలం 48 బంతుల్లో 11 సిక్సర్లు, 6 ఫోరులతో 108 పరుగులు చేసి వెనుదిరిగాడు. అప్పటికే హోబార్ట్ విజయం దాదాపుగా ఖాయం అయిపోయింది. ఇక జట్టుని విజయ్ తరాలకు చేర్చే బాధ్యతను సీనియర్ ప్లేయర్లు మెక్ డర్మాట్, వేడ్ తీసుకున్నారు. వీరిద్దరూ నాలుగు వికెట్ కు 44 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి 14 సంవత్సరాల బిగ్ బాష్ లీగ్ చరిత్రలో తమ జట్టుకు మొట్టమొదటి టైటిల్ ని తమ జట్టుకు అందించారు.