Maha Kumbh Mela: గుజరాత్ రాష్ట్రం రాజ్‌కోట్‌లోని ఒక ఆసుపత్రిలోని మహిళల చెకప్ వీడియోలను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన కేసును దర్యాప్తు చేస్తున్న గుజరాత్ పోలీసులు ముగ్గురు అనుమానితులను అరెస్టు చేశారు. వారిలో ప్రయాగ్‌రాజ్‌లోని మండ నుండి చంద్రప్రకాష్ ఫూల్‌చంద్, మహారాష్ట్రలోని లాతూర్ నుండి ప్రజ్వల్ అశోక్ తేలి, సాంగ్లి నుండి ప్రజ్ రాజేంద్ర పాటిల్ ఉన్నారు. అయితే ఈ విచారణలో అనేక ముఖ్యమైన విషయాలు వెల్లడయ్యాయి. నిందితులు టెలిగ్రామ్ గ్రూప్‌లో ఒక్కొక్కరు రెండు వేలకు అమ్మాయిలకు సంబంధించిన ఫుటేజ్‌లను అమ్మేవారని తేలింది. అరెస్టయిన ఇద్దరు నిందితులు కూడా నీట్‌కు సిద్ధమవుతున్నట్లు వెలుగులోకి వచ్చింది.
ఈ ముగ్గురూ యూట్యూబ్, టెలిగ్రామ్‌లో మహిళల అభ్యంతరకరమైన వీడియోలను అమ్మడం ద్వారా డబ్బు సంపాదించారని తెలుస్తోంది. అంతే కాకుండా మహా కుంభ మేళాలో మహిళలు స్నానం చేసి బట్టలు మార్చుకుంటున్న కొన్ని వీడియోలు, చిత్రాలు చంద్రప్రకాష్ యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దర్యాప్తులో, చంద్రప్రకాష్ సొంత ఛానెల్‌లో మహాకుంభ మేళాకు సంబంధించిన 55 నుండి 60 వీడియోలు అప్‌లోడ్ చేయబడినట్లు వెల్లడైంది.
Also Read: HKU5-CoV-2: చైనాలో కొత్త వైరస్ కలకలం, కోవిడ్ – 19 లాగే.. ఇదీ ప్రమాదకరమా?
అంతే కాకుండా నిందితులు అమ్మాయిల వీడియోలను టెలిగ్రామ్ గ్రూప్‌లో ఒక్కొక్కరికి రూ.2,000కి ఫుటేజీని అమ్మేవారు. అంతే కాకుండా అహ్మదాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆసుపత్రులు, ఇతర బహిరంగ ప్రదేశాల నుండి సీసీటీవీ ఫుటేజీలను అక్రమంగా పొందామని నిందితులు అంగీకరించారు. తర్వాత వాటిని టెలిగ్రామ్ ఛానెల్‌లో QR కోడ్ ఫార్మాట్‌లో ఒక్కొక్కటి రూ.2,000కి అమ్మేశారు. పోలీసులు ఈ ముగ్గురు నిందితులను మార్చి 1 వరకు కస్టడీకి తరలించారు.

