Banking News:వచ్చే నెలలో బ్యాంకు పనులు ఉంటే ముందే ప్లాన్ చేసుకోండి. లేకుంటే చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు బ్యాంకుకు వెళ్లాలనుకున్న రోజు బ్యాంకు సెలవు ఉండొచ్చు. ఎందుకంటే ఆ నెలలో అత్యధిక సెలవులు ఉన్నాయి. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఫిబ్రవరి సెలవుల జాబితాను తాజగా విడుదల చేసింది. ఆ జాబితాలో సెలవుల వివరాలు ఉన్నాయి.
బ్యాంకులకు సెలవులు
Banking News:ఆర్బీఐ విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం.. ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం, పండుగలు, జాతీయ దినోత్సవాలు అన్నీ కలుపుకొని ఫిబ్రవరి నెలలో మొత్తం 14 రోజులు బ్యాంకులకు సెలవు దినాలు ఉన్నాయి. ఆ నెలలో మొత్తం 28 రోజులు ఉంటాయి. అంటే నెల మొత్తంలో సగం రోజులు సెలవులే అన్నమాట. బ్యాంకు సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటాయన్న విషయాన్ని గనమించాలి.
Banking News:అందుకే సెలవుల జాబితాను బట్టి బ్యాంకుల పనులను ప్లాన్ చేసుకోవాలని వినియోగదారులకు ఆర్బీఐ సూచించింది. ముఖ్యంగా ఫిబ్రవరి నెలలో సరస్వతీ పూజ, తైపూసం, గురు రవిదాస్ జయంతి, ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి, మహాశివరాత్రి వంట పండుగలు ఉన్నాయి.