Tamil Nadu: ఆన్ లైన్ రమ్మీ ఒక కుటుంబాన్ని చంపేసింది.. చేతితో పేక ముక్క పట్టుకుంటే జోకర్ ఒకడవుతే కింగ్ ఇంకొకడవుతాడు.. కింగ్ అయినోడి కథ ఒకలా ఉంటె జోకర్ అయినోడి వ్యధ ఇంకోలా ఉంటుంది.. జోకర్ అయినాడు గుండె ధైర్యంతో చల్ దేఖ్లేంగే అని అనుకుంటే ఒకే.. అలా కాకుండా ఇదిగో ఇలా ఆలోచిస్తేనే జీవితాలు తారుమారు అవుతాయి.. ఇంతకీ ఈ ఆటలో ఇపుడు ఓడింది ఎవరు.. గెలిచింది ఎవరు..
ప్రస్తుతం యువత ఎక్కువగా ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతున్నారు. వీటి మోజులో పడి ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలాంటి దారుణమైన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తమిళనాడులోని కరూర్ సమీపంలో ఓ కుటుంబం ఆన్‌లైన్ రమ్మీకు బలైంది. ప్రేమ్‌రాజ్ అనే వ్యక్తి భార్య, పిల్లలను ఇంట్లో చంపిన ఆ తర్వాత రైలు కింద పడి ఆత్యహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆన్‌లైన్ రమ్మీలో అప్పులు చేసి తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రేమ్‌రాజ్ సూసైడ్ లేఖలో రాశాడు. దీని ద్వారా పోలీసులు ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు.
నమక్కల్ పట్టణంలో ప్రేమ్ రాజ్ ఫ్యామిలీ ఉంటోంది. ఆయన ముంబై కేంద్రంగా నడుస్తున్న బీమా బ్యాంక్‌లో బ్రాంచ్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు. కూతురుకి ఆరేళ్లు, కొడుక్కి రెండుళ్లు. ఫ్యామిలీ మొత్తం ప్రేమ్ రాజ్‌కు వచ్చిన జీతంతో జీవితం సాగింది. పిల్లలు చదువుతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ఖర్చులు, చాలని జీతం ఇవన్నీ ఆయన్ని చుట్టుముట్టాయి. దీంతో ప్రేమ్ రాజ్ తన బుర్రకు పదును పెట్టాడు.
ఇలాగైతే జీవితం కష్టమని భావించాడు. చివరకు ఆన్‌లైన్ గేమ్ ఆడడం మొదలుపెట్టాడు. మొదట్లో డబ్బులు వస్తాయి.. ఆ తర్వాత మన జేబు ఖాళీ అవుతుంది. ఈ విషయాన్ని ప్రేమ్‌రాజ్ గమనించ లేక పోయాడు. ఒకరోజు కాకపోతే మరో రోజైనా డబ్బులు పస్తాయని ఆశపడ్డాడు. కానీ ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ ఉచ్చులో చిక్కుకున్నానని ఊహించలేకపోయాడు. ఒకటీ రెండు కాదు దాదాపు 50 లక్షలు పోగొట్టుకున్నాడు.
Also Read: Malakpet Murder Mystery: వివాహిత శిరీష హత్య కేసులో బిగ్ ట్విస్ట్‌లు
అక్కడినుంచి ప్రేమ్‌రాజ్ ఆలోచన మారిపోయింది. 50 లక్షలు అప్పులు, మరోవైపు ఈ ఫ్యామిలీ.. ఈ రెండింటిని నుంచి బయటపడలేకపోయాడు. చివరకు ప్రేమ్‌రాజ్ ఆచూకీ కనిపించలేదు. చివరకు కరూర్ సమీపంలోని పశుపతి పాలాయం వద్ద ప్రేమ్ రాజ్ డెడ్‌బాడీని గుర్తించారు పోలీసులు. రైలు దూకి ప్రేమ్‌రాజ్ ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
ప్రేమ్ రాజ్-మోహన ప్రియ ఉపయోగించిన రెండు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సూసైడ్ లేఖలో తాను ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌లో ఇరుక్కొన్నానని, రూ.50 లక్షలు పోగొట్టుకున్నానని రాసుకొచ్చాడు. ఈ విషయం ఎవరికీ చెప్పే ధైర్యం లేక, తామంతా సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నామని అందులో ఉంది. దయచేసి మమ్మల్ని క్షమించాలంటూ ఆ లెటర్‌లో పేర్కొన్నాడు ప్రేమ్‌రాజ్.
ప్రేమ్ రాజ్ కనిపించకపోవడంతో తొలుత మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఆయన కుటుంబ సభ్యులను విచారించారు పోలీసులు. ఇరుగుపొరుగున ఉండే వారితో మాట్లాడారు. త్వరలో డబ్బు వస్తుందని, తిరిగి చెల్లిస్తానన్నానని ప్రేమ్ రాజ్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ మరుసటి రోజు ప్రేమ్‌రాజ్ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఇంతకీ భార్య, పిల్లలను ప్రేమ్ రాజ్ చంపాడా? వారే ఆత్మహత్య చేసుకున్నారా? అనేది తెలియాల్సివుంది