Bandla Ganesh: టాలీవుడ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తాను ఏ సినిమా నిర్మాణ పనుల్లోనూ లేనని, ఎవరితో సినిమా చేయాలన్న నిర్ణయమూ తీసుకోలేదని తెలిపారు. తన గురించి అనవసర ప్రచారాలు చేయొద్దని, సినిమాలు నిర్మిస్తున్నట్టు వార్తలు రాస్తూ ఇబ్బంది పెట్టవద్దని సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేశారు.
తనపై చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుతూ, అందరి ప్రేమ, మద్దతు అలానే కొనసాగాలని కోరుకున్నారు.
ఇటీవలి కాలంలో జరిగిన పలువురు సినీ ఈవెంట్‌లలో బండ్ల గణేశ్ కనిపించడంతో, ఆయన నిర్మాతగా మళ్లీ ఎంటర్ అవుతున్నారన్న ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తలు చక్కర్లు కొట్టాయి.
ఈ వార్తల నేపథ్యంలోనే గణేశ్ స్పందిస్తూ, తన రీఎంట్రీకి సంబంధించిన ప్రచారాలన్నీ అబద్దాలని స్పష్టం చేశారు.

