Baluchistan: బాంబు పేలుళ్లతో దద్దరిల్లుతున్న బలూచిస్థాన్‌ 

Baluchistan: పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లుతోంది. గురువారం జరిగిన బాంబు దాడిలో ముగ్గురు మృతిచెందిన ఘటన మరువక ముందే శుక్రవారం మరోసారి బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాలో బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో నలుగురు పాకిస్థాన్ సైనికులు చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. పాకిస్థాన్‌లోని అల్లర్లు జరుగుతున్న నైరుతి ప్రాంతంలో భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్న వెహికల్‌కు సమీపంలో బాంబు పేలింది. అయితే ఈదాడికి ఏ గ్రూప్ బాధ్యత వహించనప్పటికీ బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ పనే అనే తెలుస్తోంది.

BLF తరచుగా ప్రావిన్స్‌లోని భద్రతా దళాలను లక్ష్యంగా దాడులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ గత కొంతకాలంగా వేర్పాటు వాదుల తిరుగుబాటుతో అట్టుడికి పోతోంది. ఈ ప్రావిన్స్‌లో 2019లో బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ని యునైటెడ్ స్టేట్స్ ఉగ్రవాద సంస్థగా గుర్తించారు. ఈ ఉగ్రవాద సంస్థ ఆధ్వర్యంలో అనేక దాడులు జరిగాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *