Balakrishna : సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. సినీ రంగంలో ఆయన చేసిన కృషికి గాను పద్మ అవార్డు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ అవార్డు ప్రకటన తర్వాత బాలకృష్ణకు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ట్రస్ట్ యాజమాన్యం ప్రత్యేకంగా బాలకృష్ణను సత్కరించింది.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, “నాకు పద్మభూషణ్ రావడం అంటే అది నా చలనచిత్ర పరిశ్రమకు రావడమే. నా హిందూపూర్ ప్రజలకు రావడమే. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌కు రావడమే” అని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఇటీవల బాలకృష్ణ నటించిన “అఖండ”, “వీరసింహారెడ్డి”, “భగవంత్ కేసరి” సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. అలాగే, ఆయన హోస్ట్‌గా వ్యవహరించిన “అన్‌స్టాపబుల్” టాక్ షో కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ విజయాల తరువాత పద్మభూషణ్ అవార్డు రావడం బాలకృష్ణ కెరీర్‌లో మరో మైలురాయిగా మారిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
“కొంతమంది పద్మభూషణ్ రావడం ఆలస్యం అయ్యిందన్నారు. వాళ్లకు ఒకటే చెప్పాను.. నేను ఎప్పుడూ అవార్డుల గురించి పట్టించుకోను. నా పనే నాకు దైవం” అని బాలకృష్ణ అన్నారు.

