Bahubali

Bahubali: ‘బాహుబలి’ రీ-రిలీజ్‌తో మళ్లీ సంచలనం!

Bahubali: టాలీవుడ్‌ను వరల్డ్ సినిమా మ్యాప్‌లో నిలిపిన ‘బాహుబలి’ సెన్సేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందించిన ఈ భారీ చిత్రాన్ని ఆర్కా మీడియా వర్క్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ‘బాహుబలి 2’ రిలీజై ఎనిమిదేళ్లు పూర్తయిన సందర్భంగా మేకర్స్ సర్‌ప్రైజ్ ప్రకటన చేశారు. ఇండియన్ సినిమా స్థాయిని పెంచి, బాక్సాఫీస్‌లో చరిత్ర సృష్టించిన ‘బాహుబలి – ది బిగినింగ్’ను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

ప్రస్తుతం రీ-రిలీజ్‌ల ట్రెండ్ జోరుగా సాగుతుండగా, ‘బాహుబలి’ని అక్టోబర్‌లో గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈసారి కొన్ని స్పెషల్ సర్‌ప్రైజ్‌లతో సినిమాను అందించనున్నారని ప్రకటించడంతో అభిమానుల ఆసక్తి రెట్టింపైంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్‌లు మెస్మరైజ్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను మళ్లీ షేక్ చేస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రీ-రిలీజ్ ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందో వేచి చూడాలి!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *