YSRCP Truth Bomb

YSRCP Truth Bomb: మైసూర్‌ బజ్జీలో మైసూర్‌, వైసీపీ ట్రూత్‌ బాంబ్‌లో ట్రూత్‌!

YSRCP Truth Bomb: మైసూర్‌ బజ్జీలో మైసూర్‌ ఉండదు, వైసీపీ ట్రూత్‌ బాంబ్‌లో ట్రూత్‌ ఉండదు! వైసీపీ ట్రూత్‌ బాంబ్‌ ప్రకటన వెలువడగానే నెటిజన్లు చేస్తున్న కామెంట్‌ ఇది. గతంలోనూ ట్రూత్‌ బాంబ్‌ అంటూ తుస్సుమనిపించిన చరిత్ర వైసీపీది. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఇలాగే దెబ్బతిన్నది వైసీపీ. ట్రూత్‌ బాంబ్‌ అంటూ దళిత యువకుడు సత్యవర్థన్‌ కోర్టుకు ఇచ్చిన స్టేట్మెంట్‌నే ఫొటో తీసి పోస్ట్‌ చేసిన వైసీపీకి.. ఆ వెంటనే టీడీపీ దిమ్మతిరిగేలా చేసింది. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. దళిత యువకుడు సత్యవర్థన్‌ని కిడ్నాప్‌ చేస్తున్న వీడియోని బయటపెట్టింది టీడీపీ. ఈ కౌంటర్‌తో వైసీపీ ఫ్యూజులు ఎగిరిపోయిన పరిస్థితి. అలా టీడీపీ కౌంటర్‌తో తుస్సుమనింది వైసీపీ ట్రూత్‌ బాంబు. ఇక సింగపూర్‌తో చంద్ర బాబు ఒప్పందం అంతా స్కామేనని మరోసారి ట్రూత్‌ బాంబు అంటూ ముందుకొచ్చింది వైసీపీ. దానికి కౌంటర్‌గా టీడీపీ ఓ సంచలన ఆరోపణ తెరపైకి తెచ్చింది. అమరావతి ప్రాజెక్టులో సింగపూర్‌ కన్సార్టియంను కొనసాగించాలి అంటే… తనకు ‘143 కోట్ల లంచం’ ఇవ్వాలని జగన్‌ డిమాండ్‌ చేశారని రివీల్‌ చేసింది టీడీపీ. ఇక ఇప్పుడేమో.. ‘మెడికల్‌ కాలేజీలు-నిజాలు’ అంటూ మరో అనౌన్స్‌మెంట్‌ చేసింది. రేపు.. అనగా ఆదివారం రాత్రి 7 గంటలకు సంచల వీడియో రాబోతోందని హడావుడి చేస్తోంది. జగన్‌ ప్రాణాలు పోశాడు – చంద్రబాబు ప్రాణాలు తీస్తున్నాడంటూ స్లోగన్‌ కూడా ప్రచారం చేస్తోంది. “మెడికల్‌ కాలేజీలు-పీపీపీ” అంశంలో వైసీపీ రచ్చ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా నర్సీపట్నంలో పర్యటించిన జగన్‌.. అక్కడి మెడికల్‌ కాలేజీ మొండి గోడల్ని పరామర్శించారు. ఆ తర్వాత రచ్చబండ చేసుకోండని నేతలకి చెప్పి లండన్‌కి వెళ్లిపోయారు జగన్‌. ఇక జిల్లాలు, నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు చేపడుతున్న ‘రచ్చబండ’కి ప్రజల నుంచి జీరో రెస్పాన్స్‌. దీంతో ఉసూరుమంటూ ఓ పది మంది వైసీపీ నేతలే రోడ్డెక్కి, సేవ్‌ మెడికల్‌ కాలేజీస్‌… అంటూ ప్లకార్డులు ప్రదర్శించి మమ అనిపిస్తున్నారు. దీంతో ప్లాన్‌ మార్చిన వైసీపీ పెద్దలు… సోషల్మీడియాలో హడావుడికి నిర్ణయం తీసుకున్నట్లున్నారు. మొత్తానికి రేపు రిలీజ్‌ కానున్న వైసీపీ ట్రూత్‌ బాంబ్‌ అయినా.. పేలుతుందో.. లేక గతంలో మాదిరే తుస్సుమంటుందో చూడాలి.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *