YCP Shyamala Over Smart

YCP Shyamala Over Smart: యాక్టింగ్‌ ఫుల్‌, మ్యాటర్‌ నిల్‌… వైసీపీకి రోజానే బెటరేమో!

YCP Shyamala Over Smart: వైసీపీ అధికార ప్రతినిధి శ్యామలపై కర్నూలు పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు. కర్నూలు బస్సు ప్రమాదం విషయంలో ఫేక్ న్యూస్ ప్రచారం చేసినందుకు 27 మందిపై కేసు నమోదైంది. వీరిలో శ్యామలను సోమవారం గంటన్నర పాటు విచారించారు. ప్రమాదానికి ముందు బైకర్లు బెల్ట్ షాపులో మద్యం కొన్నారని ఆమె ప్రచారం చేశారు. కానీ సీసీ ఫుటేజీ, ఫ్యాక్ట్ చెక్ లైసెన్స్‌డ్ షాపులోనే కొనుగోలు జరిగినట్లు నిరూపించాయి. ఆధారాలు అడిగితే ఆమె నోరు మెదపలేదు. పార్టీ ఇచ్చిన స్క్రిప్ట్‌నే చదివానని, తనకేమీ తెలియదని బిత్తరచూపులు చూస్తూ వెల్లడించారట. అయితే విచారణ అనంతరం మీడియాతో మాట్లాడినప్పుడు మాత్రం ఆమె రెచ్చిపోయారు. తాడేపల్లి ప్రెస్ మీట్‌లో తాను పది ప్రశ్నలు అడిగానని, తప్పేముందని సవాలు విసిరారు. ఎన్ని కేసులు పెట్టినా పోరాటం ఆపనని అన్నారు. అయితే పోలీసులకు చెప్పిన సమాధానాలకు, బయట చెప్పిన మాటలు భిన్నంగా ఉండటం గమనార్హం.

Also Read: 65th National High Way: విజ‌య‌వాడ‌-హైద‌రాబాద్ హైవే విస్త‌ర‌ణ‌కు గ్రీన్‌సిగ్న‌ల్‌

కర్నూలు తాలూకా అర్బన్ పోలీస్ స్టేషన్‌లో గత నెల 30న ఈ కేసు నమోదైంది. శ్యామలతోపాటు కారుమూరి వెంకటరెడ్డి, టి.నాగార్జునరెడ్డి, నవీన్, సీవీ రెడ్డి వంటి ఫేక్‌ ప్రాపగాండా చేయడంలో ఆరితేరిన వైసీపీ నేతలపై చర్యలు మొదలయ్యాయి. డీఎస్పీ బాబూప్రసాద్ ఆధ్వర్యంలో సీఐలు, మహిళా ఎస్సై సమక్షంలో విచారణ జరిగింది. బెల్ట్ షాపు ఆరోపణకు ఆధారాలు అడిగితే శ్యామల నీళ్లు నమిలారట. పార్టీ ఆదేశాల మేరకు స్క్రిప్ట్ చదివానని స్పష్టం చేశారట. ఏది ఏమైనా శ్యామల యాక్టింగ్ స్కిల్స్‌ను వైసీపీ బాగా వినియోగించుకుంటోందన్న చర్చ నడుస్తోంది. ఆమె ముఖ కవలికలు, హావభావాలు అద్భుతమే కానీ విషయ పరిజ్ఞానం శూన్యం. స్క్రిప్ట్‌ను అప్పజెప్పడంలో మాత్రం నిష్ణాతురాలు. రోజా శకం ముగిసి శ్యామల శకం మొదలైందని పార్టీలోనే చర్చ జరుగుతోంది. కానీ ఓవర్ స్మార్ట్‌నెస్ ఆమెకు కష్టాలు తెచ్చిపెట్టింది. పోలీసు విచారణలో పార్టీని ఇరుకున పెట్టేలా మాట్లాడారు. బయట మాత్రం ధీమా ప్రదర్శించారు. ఈ డ్యూయల్ స్టాండ్‌తో ఆమె మాటలకు విలువ లేకుండా పోయింది. దీంతో సినిమా నటులతో రాజకీయాలు నడపడం కష్టమని వైసీపీ నేతలు భావిస్తున్నారట.

కర్నూలు ప్రమాదం వేళ ఆవేశపూరిత వ్యాఖ్యలు చేసిన శ్యామల, విచారణలో తన ఆవేశం అంతా యాక్టింగే అని నిరూపించుకున్నారు. ప్రెస్ మీట్లలో ఆగ్రహం, వేదికలపై ఆవేశం – అంతా నటన అన్నట్లు పోలీసులకు సమాధానాలు ఇచ్చారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసి, పార్టీ స్క్రిప్ట్ అని చెప్పడం చర్చనీయాంశం అవుతోంది. ఈ ఘటన వైసీపీ వ్యూహాన్ని ప్రశ్నార్థకం చేసింది. సినీ నటులతో మసాలా మాటలు మాట్లాడిస్తే ప్రయోజనం ఉంటుందన్న ఆలోచన బెడిసికొట్టిందా? అని అనిపిస్తోంది. మొత్తానికి శ్యామల ఫెర్ఫార్మెన్స్ పార్టీకి లాభమా, నష్టమా? అన్నది ఇప్పుడు ప్రశ్న. కానీ ఓవర్ స్మార్ట్‌నెస్ ఆమెకు, పార్టీకి కష్టాలు తెచ్చిపెట్టినట్లు కనిపిస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *