VSK Araku Kuridi: అల్లూరి జిల్లా, అరకు నియోజకవర్గంలోని కురిడి గ్రామం. ఈ గ్రామానికో ప్రత్యేకత ఉంది. గ్రామాలలో పవనిజం అని ఏదైతే చెబుతున్నామో… దానికి బీజం పడింది ఏడేళ్ల క్రితం ఈ కురిడి గ్రామంలోనే. 2019 ఎన్నికలకు జనసేన పార్టీ సమాయత్తమవుతున్న సమయంలో… గిరిజన ప్రాంతాల పర్యటనలో భాగంగా 2018లోనే ఈ కురిడి గ్రామాన్ని సందర్శించారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఆ నాడే కురిడి గ్రామస్థులకు పవన్ కళ్యాణ్ ఓ వాగ్దానం ఇచ్చారు. 2019లో జనసేన అధికారంలోకి రాలేకపోయింది. కానీ 2024లో ఎన్డీయే కూటమిలో భాగస్వామ్య పార్టీగా అధికారం జనసేనని వరించింది. సాధారణంగా ఏ నాయకుడైనా నిన్న మొన్న ఇచ్చిన వాగ్దానాలనే మరిచిపోతుంటారు. కానీ ఇచ్చిన మాటని గుండెల్లో పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్. అధికారంలోకి రాగానే కురిడి గ్రామాన్ని విజిట్ చేశారు. ఇప్పుడు పవన్ ఆ గ్రామస్తులకు తమలో ఒకడు. తమ గూడెంలో ఒకడు. అడవి తల్లి ప్రసాదించిన బిడ్డగా వారు పవన్ కళ్యాణ్‌ని చూస్తున్నారు. “ఈ బిడ్డ అందరిలా కాదు.. చెప్పినాడంటే చేస్తాడు.. ఆ నమ్మకం మాకుంది..” అంటూ ఆ అవ్వ పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేశారు పవన్ కళ్యాణ్.
Also Read: Pawan Kalyan: సినిమాలకు బ్రేక్.. ఇక నుంచి మరింత స్పీడ్ పెంచనున్న పవన్ కల్యాణ్..!!
నిజానికి గతంలో వైసీపీకి గంపగుత్తగా ఓట్లు వేసేవారు ఈ కురడి గ్రామస్తులు. కానీ ఆ అవ్వ నమ్మకంగా పవన్ కళ్యాణ్‌ని తమ నాయకుడిగా ఎంచుకున్నారు. ఎవ్వరు ఎన్ని చెప్పినా నాది మాత్రం గ్లాసు గుర్తే అంటూ జనసేనకు ఓటు వేసిందా అవ్వ. ఆ ఒక్క ఓటు విలువ నేడు గ్రామం మొత్తం తెలుసుకున్నారు. అభివృద్ధి ఫలాలు అనుభవిస్తున్నారు.
కురిడి. కేవలం 220 ఇళ్లున్న గిరిజన గ్రామం. రాకపోకలకు రోడ్డు ఉండేది కాదు. తాగడానికి నీళ్లుండేవి కాదు. వారు అడిగిన పనులన్నీ నేడు గ్రామంలో పరుగులు పెడుతున్న విషయాన్ని వారి మాటల్లోనే విందాం.
ఈ రకంగా తమ గ్రామానికి సొంత నిధుల్ని వ్యచ్చించడమే కాదు.. తమని సొంత మనుషుల్లా భావించి, ఆప్యాయంగా తన ఫామ్‌లో పండించిన మామిడి పండ్లను పంపించారంటే… తమ పట్ల పవన్ కళ్యాణ్‌కున్న ప్రేమ అలాంటిది అంటూ మురిసిపోతున్నారు కురిడి గ్రామస్తులు.