Tirumala: టిటిడి పాలక మండలి నిర్ణయాలు సుప్రీం కోర్టు తీర్పులాంటివి. అలాంటి నిర్ణయాలను టిటిడిలో పనిచేస్తున్న అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చైర్మన్ బీఆర్ నాయుడు మంచి తనాన్ని అలుసుగా తీసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న మాట వినబడుతోంది. టీటీడీ ప్రక్షాళనలో భాగంగా తిరుమల ఎస్టేట్ అధికారిగా వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. అయితే అయన వచ్చిన తర్వాత కూడా ఆ విభాగంలో ఎలాంటి ప్రక్షాళన జరగలేదు. ఏ చిన్న సంస్కరణ కూడా అమలు కాలేదు. దళారుల దందా యధేచ్చగా కొనసాగుతోంది. అనధికారికంగా తట్టలు పెట్టుకున్న వారు ఇంకా పేట్రేగిపోయారు. గత ప్రభుత్వంలో మాదిరే దళారులు, వడ్డీ వ్యాపారులు ఇప్పటికీ ఎస్టేట్ కార్యాలయంలో దందా చేస్తున్నారట. వీటికి తోడు గతంలో ధర్మారెడ్డి అఖిలాండం వద్ద తట్టలు పెట్టుకోవడాన్ని నిషేధించారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ పెద్ద ఎత్తున అక్రమంగా తట్టలు పెట్టుకున్నారు. దీంతో పాటు అనేక అక్రమాలు జరుగుతున్నాయి.
Also Read: PM Modi Mann ki Baat: మోదీ ‘మన్ కీ బాత్’: ఆగస్టు 23న ‘నేషనల్ స్పేస్ డే’పై ప్రజలకు పిలుపు
ఇక అసలు విషయానికొస్తే… తిరుమలలో అత్యంత వివాదాస్పదంగా రాయల్ సారంగీ హోటల్ వ్యవహారం నడుస్తోంది. దీని లీజుదారులు పెద్ద ఎత్తున అద్దె బకాయి ఉన్నారని టిటిడి ఎస్టేట్, రెవెన్యూ విభాగం అంటోంది. అయితే వసూళ్లతో పాటు లీజు గడువు ముగిసిపోయింది. అయితే వీరు మాత్రం తమకు రెన్యూవల్ ఇవ్వాలంటున్నారు. టీటీడీలో ఓ ఉద్యోగి కుటుంబంతో పాటు.. గతంలో తిరుపతిలో చక్రం తిప్పిన ఓ నాయకుడి అనుచరుడు ఈ హోటల్ నిర్వహిస్తున్నారు. ఎస్టెట్ విభాగంలో అధికారులు అడ్డగోలుగా సహకరించడంతో వారు ఇన్నిరోజులుగా కొనసాగుతన్నారు. తాజాగా కూడా తిరుపతిలోని అన్ని హోటల్స్కి టెండర్స్ పిలిచారు. అయితే ఈ హోటల్ నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయిస్తే పాలక మండలి తీర్మానమే పైనల్ అని తీర్పు ఇచ్చింది కోర్టు. దీంతో 22వ తేదీన పాలక మండలి సారంగి హోటల్ రెన్యువల్ ప్రపోజల్ని తిరస్కరించింది. వెంటనే నోటీసు ఇచ్చి ఖాళీ చేయించాల్సిన ఎస్టేట్ విభాగం తీరిగ్గా.. 24వ తేది ఖాళీ చేయ్యండంటూ హోటల్ వద్దకు వెళితే.. వారు మరోసారి హైకోర్టు 3 వారాల గడువు ఇచ్చిందని మరో ఉత్తర్వు చూపించారంట. ఎస్టేట్ ఆఫీసర్ వైఖరే ఇందుకు కారణమని అంటున్నారు. మొత్తం మీద పాలక మండలి మాటలను మేము వినేదే లేదన్నట్లు వ్యవహారిస్తూ అక్రమార్కులకు ఎస్టేట్ విభాగం అధికారులు వంతపాడుతూ అక్రమార్జనకు పాల్పడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి.