Sri Lakshmi Belongs to TDP: శ్రీలక్ష్మి—చిన్న వయసులోనే ఐఏఎస్ సాధించిన ఓ స్టార్ అధికారి. ఆమె సమర్థత, ఆమె ట్రాక్ రికార్డ్ ఆమెను చీఫ్ సెక్రటరీ స్థాయికి తీసుకెళ్లగలిగేది. కానీ, ఒకే ఒక్క నిర్ణయం… ఆమె జీవితాన్ని తలకిందులు చేసింది. వైఎస్ జగన్ రెడ్డి కోసం పని చేసినందుకు ఆమె జైలు పాలైంది, అనారోగ్యం పాలైంది, చివరికి అవినీతి అధికారిగా ముద్ర పడింది. జగన్ స్క్రిప్ట్‌లో ఆమె బలిపశువుగా మారింది. ఇప్పుడు ఆమెనే టార్గెట్ చేస్తూ వైసీపీ కొత్త డ్రామా మొదలెట్టింది!
వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి శ్రీలక్ష్మిపై బాంబు లాంటి ఆరోపణ పేల్చారు. ఆమె అవినీతి వేల కోట్లు అని, టీడీపీ నేతలతోనూ కుమ్మక్కైందని సంచలన ఆరోపణలు చేశారు. కాస్ట్లీ చీరలు, ఖరీదైన విగ్గులు అంటూ వ్యక్తిగత జీవితాన్ని కూడా టార్గెట్ చేశారు. ఈ ఆరోపణలు చేసేముందు భూమన కానీ, వైసీపీ కానీ కాస్తయినా ఆలోచించలేదా? తమ నీతి, నిజాయితీల గురించి ఒక్కసారైనా పరిశీలించుకోలేదా? విలువలు, విశ్వసనీయత అని రాగం తీసే జగన్.. ఇది నమ్మినవారిని నట్టేట ముంచడం కాదా? అన్న సందేహాలు రాక మానడం లేదు. రాజకీయ నాయకుడు అంటే తన కోసం పనిచేసిన వారిని కాపాడుకోవాలి. వారికి గౌరవం ఇవ్వాలి. కానీ, జగన్ రాజకీయం విష సర్పం లాంటిది అంటున్నారు కొందరు పరిశీలకులు. వాడుకుని, అవసరం తీరాక వదిలేయడం కాదు.. ఏకంగా వారిపైనే విషం చిమ్మడం, కుట్రలు చేయడం జగన్ స్టైల్‌గా కనబడుతోందని అంటున్నారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం నుంచి మోపిదేవి వెంకటరమణ వరకూ… జగన్ కోసం తమ జీవితాల్ని బలిచ్చినవారు ఎందరో ఉన్నారని గుర్తు చేస్తున్నారు. కానీ, రాజకీయ లాభం కోసం వారిని రోడ్డున వదిలేసేందుకు జగన్ ఏమాత్రం వెనకాడలేదంటున్నారు. శ్రీలక్ష్మి ఇప్పుడు ఆ జాబితాలో చేరారంటూ విశ్లేషిస్తున్నారు.
Also Read: Railway: తెలంగాణలో భారీ వర్షాలు.. పలు రైళ్ల రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
రాజకీయంలో నమ్మకం, విధేయత అనేవి ఒక్కోసారి శాపంగా మారతాయి అనడానికి శ్రీలక్ష్మి కథ ఒక హెచ్చరిక. ఒకప్పుడు జగన్ కోసం జైలుకెళ్లిన ఆమె, ఇప్పుడు అదే పార్టీ ఆరోపణల బాణాలకు గురైంది. రాజకీయంలో విధేయత చూపిస్తే గౌరవం దక్కుతుందని అనుకుంటే పొరపాటే అనడానికి శ్రీలక్ష్మి జీవితమే నిదర్శనం. ఇప్పుడు జగన్ దృష్టిలో శ్రీలక్ష్మి కూడా… తల్లి విజయలక్ష్మి, చెల్లెళ్లు షర్మిల, సునీతల మాదిరిగా.. టీడీపీ మనిషి అయిపోయారు.

