Social Media Party YSRCP: వైసీపీ సోషల్‌మీడియాలో చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందన్నది చాలా మంది ఫీలింగ్. కానీ ఆ పార్టీ అఫీషియల్ హ్యాండిల్స్‌లో పోస్టు చేస్తున్న కంటెంట్ చూస్తే… ది వీకెస్ట్ పార్టీ, లేదా ది వరస్ట్ పార్టీ ఇన్ సోషల్‌మీడియా అనాల్సి వస్తోంది. అందులో పోస్టు చేస్తున్న కంటెంట్ కానీ, ఆ పార్టీ లేవనెత్తుతున్న అంశాలు కానీ అంత చెత్తగా ఉంటున్నాయి. ఏ పార్టీ సోషల్‌మీడియా ఖాతాలనైనా ఆ పార్టీ అభిమానులు, కార్యకర్తలే ఫస్ట్ విజిట్ చేస్తుంటారు. పార్టీ ఇచ్చిన కంటెంట్‌ని వైరల్ చేస్తుంటారు. కానీ వైసీపీ పరిస్థితి ఇందుకు రివర్స్‌లో ఉంటోంది. అసలు వైసీపీ సోషల్‌మీడియా ఖాతాలను మెయింటైన్ చేస్తున్న అడ్మిన్ ఎవడో కానీ… అతడు పెడుతున్న సిల్లీ కంటెంట్‌ని చూసి వైసీపీ క్యాడర్ పారిపోతుంటే.. కూటమి పార్టీలతో పాటూ, న్యూట్రల్ నెటిజన్లు ఆ కంటెంట్‌ని చీల్చి చెండాడుతూ కామెంట్లు పెడుతున్నారు. తాజాగా మంత్రి నారా లోకేష్‌ని టార్గెట్ చేసిన విధానం చూస్తే… ఇదేనా ఒకప్పుడు 151 సీట్లతో పవర్లోకి వచ్చిన పార్టీ అన్న సందేహం రాకుండా మానదు ఎవరికైనా.
‘ఆటోడ్రైవర్ల సేవలో’ అంటూ అక్టోబర్ 5న కూటమి ఓ ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది. ఆటో వాలాల డ్రస్సులో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సహా మంత్రి నా లోకేష్ దర్శమిచ్చారు. ముగ్గురు మూడు ఆటోలలో సభా వేదిక వద్దకు చేరుకున్నారు. అందులో లోకేష్‌ను తీసుకొచ్చిన ఆటో డ్రైవర్ ఓ మహిళ. వయసులో లోకేష్ కన్నా ఆమె పెద్దదానిలాగే ఉన్నారు. అయినా లోకేష్ ఆమెను చెల్లెమ్మా అంటూ ఆప్యాయంగా సంభోదించారు. ఆమెతో సరదాగా మాట్లాడుకుంటూ ప్రయాణించారు మంత్రి లోకేష్. ఆ సరదా సంభాషణలో.. ఆటోలో ఆమె పక్కనే కూర్చుని కవర్ చేస్తున్న కెమెరా మెన్ని ఉద్దేశిస్తూ… ”మీరు చెల్లెమ్మను ఆటో నడపనివ్వండి… కంగారు పెట్టకండి… కంగారులో ఆటోని ఎవరికైనా ఢీకొట్టిస్తే మళ్లీ నాకే బొక్క” అంటూ మాట్లాడారు నారా లోకేష్. అందుకు ఆమె చిరునవ్వులు చిందిస్తూ.. ‘నేను చాలా జాగ్రత్తగానే నడుపుతానండీ’ అంటూ బదులిచ్చారు. కానీ ఇందులో అసభ్యత ఎక్కడుందో కానీ.. వైసీపీకి పెద్ద బండ బూతు కనిపించింది అందులో. లోకేష్ స్టాన్ ఫోర్డ్ చదువుల గురించి ప్రస్తావిస్తూ.. ఇదేనా మీ అమ్మగారు మీకు నేర్పిన సంస్కారం అంటూ రాసుకొచ్చింది వైసీపీ తన సోషల్‌మీడియా ఖాతాలో. ఆటో ఎక్కడైనా ఢీకొడితే నాకే బొక్క.. మళ్లీ నన్నే అంటారు.. నా మీదే ట్రోల్స్ చేస్తారు.. అన్న అర్థంలో లోకేష్ అన్న మాటలకు పెడార్థాలు తీస్తూ వైసీపీ చేసిన పోస్టు గురించి ఎవరూ మాట్లాడాల్సిన పని లేదు. ఆ పోస్టు కింద వచ్చిన కామెంట్లు చదువుకుంటే వైసీపీకే అర్థమవుతుంది… ఆ అకౌంట్ అడ్మిన్ చేసింది ఎంతటి దిక్కుమాలిన పనో..!
Also Read: Pawan Kalyan: కురుపాం గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినుల మృతి బాధాకరం
151 సీట్లతో ఓసారి అధికారంలోకి వచ్చిన పార్టీ. సోషల్‌మీడియాలో మాత్రం ది వరస్ట్ పార్టీలా బిహేవ్ చేస్తుండటం వైసీపీ అభిమానులకే నచ్చడం లేదు. అందుకే వైసీపీ అఫీషియల్ ఖాతాల్లో పెడుతున్న పోస్టులకు మినిమం రీచ్ ఉండట్లేదు. ”అబద్దం ఆడితే గోడ కట్టినట్టు ఉండాలి. ఫేక్ పోస్టు చేస్తే అతికినట్లు ఉండాలి. కనీసం ఫేక్ చేయడం కూడా రాకుంటే.. సైలెంట్‌గా అయినా ఉండాలి. అంతే తప్ప.. మరీ ఇలా దొరికిపోయేలా సిల్లీ పోస్టులు పెట్టడం ఏంటి? సిగ్గు చేటు కాకపోతే. ఈ వైసీపీ అడ్మిన్‌కు ఇంతకంటే మంచి కంటెంట్ దొరకట్లేదా? మినిమం డిగ్రీ అయినా పాస్ అయ్యుంటాడా? లేక ఏ థంబ్స్ అప్ బ్యాచ్నో తెచ్చి పెట్టుకున్నారా?” ఇదీ ఇప్పుడు వైసీపీ సోషల్‌మీడియా శ్రేణుల మధ్య నడుస్తున్న డిష్కషన్. నిజానికి… ఓ రాజకీయ పార్టీ తన అఫీషియల్ సోషల్‌మీడియా హ్యాండిల్స్‌ని ఎలా నడపకూడదో.. అలాగే నడిపిస్తోంది వైసీపీ. ఇకనైనా ఈ తప్పును సరిదిద్దుకుంటుందేమో వేచి చూద్దాం.