Perni Nani Loves Kootami

Perni Nani Loves Kootami: కూటమి ఫ్యాన్స్‌ని ఖుషీ చేసే వార్త చెప్పిన పేర్ని!

Perni Nani Loves Kootami: మాజీ మంత్రి పేర్ని నాని తాజా వ్యాఖ్యలు చాలా గమ్మత్తుగా ఉన్నాయి. ఓ ప్రైవేట్ న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, ఏపీ రాజకీయాలపై తనదైన విశ్లేషణ చేశారు. వైసీపీ ఓటమికికారణాలు విశ్లేషించారు. తిరిగి అధికారంలోకి రావడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి జగన్‌కి సూచనలు చేశారు. ప్రజా సమస్యలపై జగన్‌ ఎలా పోరాటం చేయాలో, పార్టీ బలోపేతం కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో స్పష్టంగా మాట్లాడారు. ఎప్పటిలాగే బహిరంగంగా, నిర్మొహమాటంగా సమాధానాలు చెప్పుకొచ్చారు పేర్ని నాని.

ఇక అదే ఇంటర్వ్యూలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మైత్రి గురించి చర్చకొచ్చింది. దీనిపై సదరు ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రశ్నకు పేర్ని తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. చంద్రబాబు, పవన్ కలిసి ఉండడానికి జగనే కారణం అన్నారు. జగన్ పేరు చెప్పి ప్రజల్ని భయపెడుతున్నారనీ, జగన్‌ను ఒంటరిగా ఎదుర్కోలేకే ఇద్దరూ ఏకమవుతున్నారనీ చెప్పుకొచ్చారు. అదే సమయంలో వారిలో వారికి ఎన్ని గొడవలు వచ్చినా, సర్థుకుపోతారు తప్ప వీరు విడిపోరంటూ కుండ బద్ధలు కొట్టారు. ఓ వైపు అసెంబ్లీలో బాలయ్య వ్యాఖ్యల్ని పట్టుకుని కూటమిలో ఎలాగైనా చీలిక తేవాలని వైసీపీ, జగన్‌ మీడియా రేయింబవళ్లు చెమటోడ్చి, మెడళ్లకు పని చెప్పి, స్ట్రాటజిస్టులను రంగంలోకి దింపి, పట్టువదలని విక్రమార్కుల్లా పనిచేయబట్టి నేటికి వారం రోజులు కావస్తోంది. చిరంజీవి అభిమానులు చల్లబడిపోయారు, బాలయ్య ఫ్యాన్స్‌ సద్దుమణిగారు. కానీ వైసీపీకి మాత్రం నిద్రపట్టడం లేదు. ఇలా జగన్‌, ఆయన పార్టీ, మీడియా అందరూ నిద్రలేని రాత్రులు గడుపుతున్న సమయంలో పేర్ని నాని ఎంట్రీ ఇచ్చి… మీరెన్ని ప్రయత్నాలు చేసినా కూటమిని విడదీయడం మీ వల్ల కాదురా అబ్బాయిలూ.. అన్నట్లుగా గాలి తీసి పడేశారు అంటున్నారు ఫ్యాన్‌ పార్టీ అభిమానులు.

Also Read: US Government Shuts Down: ప్రభుత్వ షట్‌డౌన్‌.. పెద్ద సంక్షోభంలోకి అమెరికా

ఇక పేర్ని వ్యాఖ్యలపై కూటమి నేతలు రెండు రకాలుగా స్పందిస్తున్నారు. ఒకవైపు, గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చంద్రబాబును ఎదుర్కోవడానికి పొత్తులు పెట్టుకున్నారని సెటైర్లు వేస్తున్నారు. మరోవైపు, చంద్రబాబు-పవన్ కూటమి ఉన్నంత కాలం జగన్‌కు అధికారం అందని ద్రాక్షేనని పేర్ని ఒప్పుకున్నారంటూనే… వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా వీరి మైత్రిని విడదీయడం అసంభవం, అసాధ్యమని జగన్‌కు పేర్ని నాని హితబోధ చేశారంటూ ఎద్దేవా చేస్తున్నారు. పేర్ని నాని వ్యాఖ్యలు ఎప్పటిలాగే మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలు వైసీపీ కార్యకర్తలను కలవరపెడుతోంటే.. కూటమి శ్రేణులు మాత్రం… నాని మనోడు కాకపోయినా మనకు నచ్చే మాట, మనసుకు ఇంపైన మాట చెప్పాడ్రా అంటూ సంబరపడుతున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *