Pawan AI Plan Workout

Pawan AI Plan Workout: అందరూ ఏఐ గురించి మాట్లాడుతుంటే, చేతల్లో చూపెట్టిన పవన్‌

Pawan AI Plan Workout: అటవీ పరివాహక ప్రాంతాలు, ఏజెన్సీ ఏరియాల్లో మనుషులు, జంతువుల మధ్య సమన్వయం అత్యంత కీలకం. ముఖ్యంగా ఏనుగులు గ్రామాల్లోకి చొచ్చుకువచ్చి పంటలను నాశనం చేయడం సర్వసాధారణంగా మారింది. ఈ బెడద నుంచి పంటలను కాపాడేందుకు ఏపీ డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ చొరవతో కర్ణాటక నుంచి నాలుగు కుంకీ ఏనుగులను తీసుకొచ్చారు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ ఏనుగులను అందజేసింది. ఇవి అటవీ, ఏజెన్సీ ప్రాంతాల్లో ఏనుగుల సంచారాన్ని కొంతవరకు నియంత్రిస్తున్నాయి. అంతటితో ఆగని పవన్ కల్యాణ్, టెక్నాలజీని ఉపయోగించి శాశ్వత పరిష్కారం కోసం ముందుకెళ్లారు. సోలార్ ప్యానెల్స్ ఆధారిత ఏఐ టెక్నాలజీతో ఏనుగుల రాకను ముందుగానే గుర్తించే వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఏనుగులు సమీపించగానే గన్ షాట్ లాంటి భారీ శబ్దాలు ఆటోమేటిక్‌గా పేలుతాయి. ఈ శబ్దాలకు భయపడి ఏనుగులు పారిపోతాయి. అలా ఒక ఏనుగు.. గన్‌ షాట్‌ శబ్దం విని, వెనుదిగిరి అడవిలోకి పరుగులు తీసే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వినూత్న పద్ధతి దశాబ్దాల సమస్యకు శాశ్వత పరిష్కారం కానుంది.

Also Read: Crypto: కుప్పకూలిన బిట్ కాయిన్ విలువ.. $1 ట్రిలియన్‌కు పైగా నష్టం.. కారణం ఏంటంటే..

ఏనుగులు గ్రామాల్లోకి అడుగుపెట్టకుండా, పంట నష్టం సృష్టించకుండా కంట్రోల్ చేసే ఈ విధానాన్ని గ్రామస్థులు తెగ మెచ్చుకుంటున్నారు. సత్ఫలితాలు కనిపిస్తుండడంతో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ దీనిని విస్తరించేందుకు అటవీ శాఖ సన్నాహాలు చేస్తోంది. పొరుగు రాష్ట్రాలు కూడా ఈ మోడల్‌ను అనుసరించాలని ఆలోచిస్తున్నాయి. ప్రపంచంలోనే తొలిసారిగా ఏఐతో ఏనుగులను నియంత్రించిన ఘనత ఏపీకే దక్కనుందని నెటిజన్లు పవన్‌ను ప్రశంసిస్తున్నారు. ఏపీలో తూర్పు కనుమల నుంచి నల్లమల వరకు విస్తారమైన అటవీ ప్రాంతం ఉంది. నల్లమల అడవుల నుంచి రాయలసీమ, ఒడిస్సా నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ఏనుగుల బెడద ఉంటోంది. దశాబ్దాలుగా ఈ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రాణ నష్టం, అపార పంట నష్టం జరిగేవి. ఏనుగుల కారిడార్ వంటి ప్రయత్నాలు విఫలమయ్యాయి. 2024 జూన్‌లో కూటమి అధికారంలోకి వచ్చాక పవన్ కల్యాణ్ ఈ సమస్యను గుర్తించారు. అటవీ శాఖ అధికారుల సలహాతో కుంకీ ఏనుగులను తీసుకొచ్చారు. తన పొలిటికల్ గ్లామర్‌ని ఉపయోగించి కర్ణాటక ప్రభుత్వాన్ని ఒప్పించారు. కుంకీ ఏనుగుల వల్ల కొంత ఉపశమనం లభించింది. ఇప్పుడు శాశ్వత పరిష్కారం కోసం ఏఐ పరికరాలను అమర్చారు. ఏనుగులు వచ్చిన వెంటనే అధికారులకు అలర్ట్ వెళ్తుంది. ఆటోమేటిక్ శబ్ద వ్యవస్థ ఏనుగులను తరిమికొడుతుంది. పవన్‌ కళ్యాణ్‌ ఇష్టంగా తీసుకున్న అటవీ శాఖలో ఏఐ వంటి వినూత్న ఆలోచనలు అమలు చేస్తున్నారు. అటవీ ఉత్పత్తులు, జంతువుల రక్షణ పరస్పరం సాధ్యం చేస్తూ ముందుకు సాగుతున్నారు. విశ్లేషకులు సైతం పవన్‌ కళ్యాణ్‌ తీసుకొస్తున్న రెవల్యూషన్స్‌ అద్భుతం అని అభివర్ణిస్తున్నారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *