Nara Lokesh Golden Leg: ఏపీలో క్రికెట్ నుంచి వాలీబాల్ వరకు ఆటగాళ్లు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నా, రాష్ట్రానికంటూ ఓ క్రీడా పాలసీ లేదు. వైసీపీ హయాంలో ‘ఆడుదాం ఆంధ్ర’ అంటూ వినూత్న కార్యక్రమం చేపట్టినా అది అక్రమాల బాట పట్టింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మహిళా క్రీడాకారిణులను ప్రోత్సహించేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ఐటీ మంత్రి నారా లోకేష్ స్పోర్ట్స్ పాలసీ రూపకల్పనలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల దిగ్గజ క్రికెట్ క్రీడాకారిణి మిథాలీ రాజ్‌తో భేటీలో మహిళా క్రికెట్‌కు అవసరమైన అవకాశాలు, కల్పించాల్సిన సదుపాయాలపై చర్చించారు. విమెన్ వరల్డ్ కప్‌కు భారత్ ఆతిధ్యమివ్వగా.. తొలి మ్యాచ్ విశాఖ వేదికగానే జరగడం గమనార్హం. విశాఖలో ఆస్ట్రేలియా-భారత మహిళల మ్యాచ్‌ని స్వయంగా వీక్షించారు మంత్రి నారా లోకేష్. ఆ రోజు పలువురు క్రీడా దిగ్గజాలతో మైదాన సౌకర్యాలు, ఇంకా మెరుగుపరచాల్సిన విషయాల గురించి చర్చించారు. అలా ఒక మంత్రి స్వయంగా మ్యాచ్ చూడటం, ప్లేయర్లతో సంభాషించడాన్ని ఆనాడు అంతా విశేషంగా చూశారు.
Also Read: TDP Malepati Death Lesson: పాఠం నేర్చుకోకుంటే టీడీపీ ఉనికికే ప్రమాదం!
ఇక విమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఏపీ వ్యాప్తంగా పలు చోట్ల కూటమి ఎమ్మెల్యేలు బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. దాంతో గ్రామాల్లో మహిళలు సైతం నిన్నటి మ్యాచ్‌ని ఆస్వాదించారు. ఇక పాఠశాలల్లో బ్లాక్ బోర్డుల స్థానంలో టీవీలను ఏర్పాటు చేసి మరీ విద్యార్థినుల కోసం అరేంజ్మెంట్స్ చేశారు. ఇదంతా విద్యార్థినులను క్రీడలవైపు మళ్లించడం, తమ ఇంటి మహా లక్ష్ములను స్పోర్ట్స్ విమెన్స్గా ప్రోత్సహించే దిశగా వారి తల్లిదండ్రుల్ని మోటిచేయడంలో భాగం. ఇదంతా లోకేష్ ఆధ్వర్యంలో వర్థమాన మహిళా క్రీడాకారులను వెలికి తీసే ప్రక్రియలో భాగంగా జరుగుతున్న మాట వాస్తవం. మహిళల వరల్డ్ కప్‌కు ఇండియా వేదికగా మారడం, విశాఖ ప్రారంభ మ్యాచ్‌కు లోకేష్ హాజరవడం, రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించడం, ఇవన్నీ ఆయనలో చొరవకు నిదర్వనం. ఇక నవీ ముంబైలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌ని వీక్షించేందుకు కుటుంబంతో సహా హాజరైన లోకేష్.. అక్కడ క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ని కలిసి, ఎంతో ఆప్యాయంగా ఆయనతో మాట్లాడి, ఏపీలో క్రికెట్ అభివృద్ధికి సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఇలా వరల్డ్ కప్ ప్రారంభం నుంచి ఫైనల్ మ్యాచ్ వరకూ లోకేష్ ఉనికి, చొరవ స్పష్టంగా కనిపించింది. ఒకప్పుడు లోకేష్‌ని పప్పు, ఐరన్ లెగ్ అంటూ అవహేళన చేశారు ప్రత్యర్థి పార్టీల వారు. ఇప్పుడు ఆయనపై ఆ ముద్ర చెరిగిపోయి, తనది ‘గోల్డెన్ లెగ్’గా నిరూపించుకుంటూ కొత్త ఒరవడి సృష్టిస్తున్నారు నారా లోకేష్.

