KTR vs CM Ramesh War: బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనానికి నాడు కేటీఆరే రాయబారం నడిపారా? కేంద్ర పెద్దల్ని ఒప్పించమని బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌ని కోరారా? ప్రతిఫలంగా కవితతో సహా అందరిపై విచారణలు ఆపేయాలని కోరారా? ఢిల్లీలోని సీఎం రమేష్ ఇంటికి కేటీఆర్ రాకపోకలు సాగించారా? మొత్తం సీసీ ఫుటేజీలతో సహా బయటపెడతానంటున్నారు బీజేపీ ఎంపీ సీఎం రమేష్. ఫ్యూచర్ సిటీలో సీఎం రమేష్‌కు చెందిన రుత్విక్ ప్రాజెక్ట్స్‌కు ఓ రోడ్డు కాంట్రాక్ట్ దక్కడంపై కేటీఆర్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. సీఎం రమేష్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు బ్యాచ్, ఆంధ్రా కాంట్రాక్టర్లు అంటూ రాజకీయం చేయబోయిన కేటీఆర్‌కు… షాకింగ్ కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎంపీ సీఎం రమేష్. బీఆర్ఎస్ విలీనానికి బీజేపీ సహకరించలేదనే అసహనంతోనే కేటీఆర్ తనపై ఆరోపణలు చేస్తున్నారంటూ సీఎం రమేష్ సంచలన విషయాలు వెల్లడించారు. తన ఇంటికి ఎవరెవరు వచ్చారో, కవితతో సహా తమపై ఉన్న కేసులలో విచారణ నిలిపేస్తే బీఆర్‌ఎస్‌ను విలీనం చేస్తానని కేటీఆర్ రాయబారం నడిపారో లేదో.. తన వద్ద ఆధారాలున్నాయని, కావాలంటే తన ఇంటి సీసీ టీవీ పుటేజీ మొత్తం బయటపెడతానంటూ వార్నింగ్ ఇచ్చారు సీఎం రమేష్. విలీనంపై మాట్లాడలేదని కేటీఆర్ తన ఇష్ట దైవంపై ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. అంతేనా… కేటీఆర్ అమెరికాకు, మాల్‌దీవులకు ఎలా వెళ్లారో.. ఎవరితో వెళ్లారో.. మొత్తం వివరాలు ఈడీ, సీబీఐకి ఇస్తానంటున్నారు సీఎం రమేష్.
Also Read: Viral Video: అదుపుతప్పిన ట్రక్కు.. నుజ్జు నుజ్జు అయిన 20 కార్లు.. వీడియో వైరల్
రేవంత్ రాజకీయం ముందు నిలబడలేక కేటీఆర్ ఫ్రస్టేషన్‌లో ఉన్నారా? లేక ఎక్కడ టీడీపీ తెలంగాణలో రీఎంట్రీ ఇస్తుందోనన్న భయం పట్టుకుందా? కన్ఫ్యూజన్‌లో లాజిక్ లేని ఆరోపణలు చేస్తున్నారా? తాజాగా ఎంపీ సీఎం రమేష్‌కు, రేవంత్ రెడ్డికి లింక్ పెట్టి చేసిన విమర్శల్లో కూడా ఎలాంటి లాజిక్ లేదు. ఫ్యూచర్ సిటీలో ఓ రోడ్ కాంట్రాక్ట్‌ను దక్కించుకున్న రిత్విక ప్రాజెక్ట్స్.. కాంపిటీటివ్ బిడ్ ద్వారా పోటీలో నెగ్గి టెండర్ దక్కించుకుంది. అంతేకానీ నామినేషన్ పద్దతిలో అప్పనంగా కొట్టేసిన టెండర్ ఏమీ కాదంటున్నారు సీఎం రమేష్. అయినా.. తెలంగాణలో ఆంధ్రా సంస్థకు కాంట్రాక్ట్‌లు.. చంద్రబాబు మనుషుల కోసం రేవంత్ ఎలా కిరికిరి చేశారో చూడండి అంటూ కేటీఆర్ విమర్శలు చేశారు. ఇక… కంచ గచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టడానికి… సీఎం రమేష్ సహకరించడం వల్లే ఈ కాంట్రాక్ట్ ఇచ్చారని ఆరోపించారు. అయితే… కంచ గచ్చిబౌలి భూములకు బాండ్లు రిలీజ్ చేశారు తప్ప… తాకట్టు పెట్టలేదని కేటీఆర్‌కు తెలీదా? తెలిసే మాట్లాడుతున్నారా? ఏది ఏమైనా ఇలాంటి తలాతోక లేని ఆరోపణలతో మరింత చులకన అవుతున్నారు కేటీఆర్.

