Kommineni Remand

Kommineni Remand: దారుణమైన ట్రాప్‌లో కొమ్మినేని?

Kommineni Remand: సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు, సాక్షి మీడియా యాంక‌ర్‌గా ప‌నిచేస్తున్న కొమ్మినేని శ్రీనివాస‌రావుకు మంగ‌ళ‌గిరి స్థానిక కోర్టు.. 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయ‌న‌ను పోలీసులు గుంటూరు జిల్లా జైలుకు త‌ర‌లించారు. కోర్టులో ప్ర‌భుత్వం త‌ర‌ఫున న్యాయ‌వాది వాద‌న‌లు వినిపిస్తూ.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్ష‌న్ కింద కేసులు న‌మోదు చేశామ‌ని.. బెయిల్ ఇవ్వరాద‌ని కోరారు. వాస్త‌వానికి అప్ప‌టికి కొమ్మినేని త‌ర‌ఫున న్యాయ‌వాదులు ఇంకా బెయిల్ పిటిష‌న్ దాఖ‌లు చేయ‌లేదు. లాస్ట్‌ మినిట్‌లో బెయిల్ పిటిష‌న్ దాఖ‌లు చేయ‌గా.. దానిని ప‌క్క‌న పెట్టిన కోర్టు రిమాండ్ విధించినట్లు సమాచారం. ఇక్కడి నుండే అనేక ప్రశ్నలు వ్యక్తమవుతుండటం విశేషం.

కొమ్మినేని తరఫున వకాల్తా పుచ్చుకుని రంగంలోకి దిగింది… అందరికీ సుపరిచితుడైన ప్రముఖ న్యాయశాస్త్ర కోవిదుడు, వైసీపీ ఆస్థాన లాయర్‌గా సేవలందిస్తున్న పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక ఆయన అనేక మంది వైసీపీ నాయకుల తరఫున వాదించి.. సక్సెస్‌ఫుల్‌గా జైలుకు పంపారు. పొన్నవోలు కేసు టేకప్‌ చేస్తే.. మినిమం 14 రోజులు రిమాండ్‌ గ్యారెంటీ అని న్యాయవాదుల వర్గాల్లో ప్రచారం కూడా ఉంది. అయితే కొమ్మినేని కేసులో పొన్నవోలు ఎందుకు ఎంటరయ్యారన్నదే ఇక్కడ అనుమానించాల్సిన విషయం. ఓ వైపు జగన్‌ తనకు చానల్‌ లేదు, పేపర్‌ లేదు అంటుంటారు. మరోవైపు సాక్షి జర్నలిస్టులపై కేసులు కూడా వైసీపీ నేత పొన్నవోలే వాదించడం మొదలుపెట్టారు.

కొమ్మినేని అరెస్టు అనివార్యంగా జరిగింది. ఆ రకంగా కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. శాంతి భద్రతల దృష్ట్యా అరెస్ట్‌ చేయాల్సి వచ్చింది. పనిగట్టుకుని కొమ్మినేనిని జైలుకు పంపే ఉద్దేశం ప్రభుత్వానికి కూడా లేదు. కానీ ఆ అవసరం వైసీపీకి ఉన్నట్లుంది. అందుకే పొన్నవోలును రంగంలోకి దించినట్లుంది. అన్నీ తెలిసిన సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని కూడా.. పొన్నవోలు కేసు వాదిస్తానంటే ఎలా అంగీకరించారో తెలీదు కానీ.. పొన్నవోలు అంతకు ముందు రోజు రాత్రి గుంటూరు పోలీస్‌ స్టేషన్‌ వద్ద మాట్లాడిన మాటలతోనే… కొమ్మినేని జైలుకు వెళ్లక ఇక తప్పదని అందరికీ అర్థమైపోయింది. కొమ్మినేని అరెస్ట్‌పై స్పందిస్తూ… ప్రజాస్వామ్యం, అప్రకటిత ఎమర్జెన్సీ వంటి పదాలతో మొదలుపెట్టిన పొన్నవోలు.. ఆ రోజు సాక్షి డిబేట్‌లో కొమ్మినేని, కృష్ణంరాజుల మధ్య కన్వర్జేషన్‌ మొత్తాన్ని పేపర్‌పై రాసుకొచ్చాననీ, ఇందులో ఎక్కడా కొమ్మినేని తప్పు మాట్లాడలేదని, ఇదే అస్త్రాన్ని కోర్టులో ప్రయోగించబోతున్నానని చెప్పారు. అయితే కొమ్మినేని వెకిలినవ్వులను పొన్నవోలు పేపర్‌పై ఎలా పెట్టారన్న డౌట్‌ రాక మానదు.

ALSO READ  Cricket Stadium: వరల్డ్‌ లార్జెస్ట్‌ స్టేడియం @అమరావతి

Also Read: Mahaa Conclave 2025: మహా కాన్ క్లేవ్ కు సర్వం సిద్ధం..ప్రజల సమస్యలపై మహా వంశీ ప్రశ్నలు

Kommineni Remand: అయితే న్యాయమూర్తి మాత్రం పొన్నవోలు పట్టుకొచ్చిన పేపర్‌ని పక్కన పెట్టి.. డిబేట్‌కు సంబంధించిన వీడియోను రెండుసార్లు నిశితంగా పరిశీలించారు. కొమ్మినేనికి 14 రోజుల జ్యూడీషియల్‌ రిమాండ్‌ విధిస్తూ తీర్పు చెప్పారు. సోమవారం రాత్రి ప్రెస్మీట్‌లో పొన్నవోలు ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు కూడా చేశారు. కొమ్మినేనిని ఎలాగైనా బయటకు తీసుకొస్తానని హామీ ఇవ్వాల్సిన పొన్నవోలు.. కొమ్మినేనికి ఏదైనా జరిగితే డెడ్‌బాడీ ఇంటికి తీసుకెళ్దాం అంటూ కొమ్మినేని కుటుంబ సభ్యుల్ని భయపెట్టారు.

తన కేసులు కానీ, తన సోదరుడు కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి కేసులు కానీ.. ముంచుకొచ్చినప్పుడల్లా.. ఢిల్లీ నుండి.. సుప్రీంకోర్టు సీనియర్‌ మోస్ట్‌ లాయర్లను.. దేశంలోనే టాప్‌ పొజిషన్‌లో ఉన్న ఖరీదైన లాయర్లను.. గంటకు లక్షల్లో ఫీజులు చెల్లిస్తూ.. ఆఘమేఘాల మీద.. స్పెషల్‌ చార్టెడ్‌ ఫ్లయిట్లలో తీసుకొచ్చి.. ఇక్కడ దించుతుంటారు జగన్‌మోహన్‌రెడ్డి. కానీ పార్టీ నాయకులు, కొమ్మినేని లాంటి కరుడుగట్టిన వైసీపీయులు అరెస్ట్ అయినప్పుడు మాత్రం.. వారి కేసులు చూడమని పొన్నవోలును పంపిస్తుంటారు. పొన్నవోలు కూడా జగన్‌ ఇచ్చిన టాస్క్‌ని విజయవంతంగా అమలు చేస్తుంటారు. ఫలితంగా నేతలు జైళ్లకు వెళ్తుంటారు. తిరిగి జగనే మళ్లీ జైళ్లకు వెళ్లి వారిని పరామర్శిస్తుంటారు. ఇదంతా గమనిస్తే.. ఇప్పుడు వైసీపీ సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని విషయంలోనూ అదే జరిగిందా? అన్న డౌటనుమానం అందరిలోనూ వ్యక్తమవుతోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *