Revanth Reddy Delhi Tour: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) రెండు రోజుల ఢిల్లీ పర్యటనను పూర్తి చేసి హైదరాబాద్‌కు మంగళవారం మధ్యాహ్నం 12:30కు బయలుదేరనున్నారు. తన పర్యటనలో భాగంగా కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖల కేటాయింపు సంబంధించి కీలకంగా చర్చించారు.
ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానంతో జరిగిన భేటీలో రేవంత్ రెడ్డి కొత్త మంత్రుల శాఖల కేటాయింపుపై సమగ్ర నివేదికను సమర్పించారు. పార్టీలో సీనియారిటీ, సామాజిక సమతుల్యత, ప్రాంతీయ ప్రాతినిధ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ శాఖల పంపిణీపై చర్చలు జరిగినట్లు సమాచారం.
కాంగ్రెస్ హైకమాండ్ నుండి కీలక సూచనలు అందిన నేపథ్యంలో… నేడు లేదా రేపు అధికారికంగా శాఖల కేటాయింపుపై స్పష్టత రావొచ్చని అంచనాలు వెల్లువెత్తుతున్నాయి..
ఇది కూడా చదవండి: Narendra Modi: దేశం గొంతుకను గట్టిగా వినిపించారు.. ప్రతిపక్షాలను ప్రశంసించిన మోడీ
ఈ క్రమంలో రేవంత్ ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయంగా కీలకమైందిగా భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయి కార్యనిర్వాహక వ్యవస్థను ఉంచేందుకు ఇవే చివరి దశలుగా కనిపిస్తున్నాయి.
తెలంగాణ ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ఉన్నట్లు ఇప్పటికే రేవంత్ పలు సందర్భాల్లో స్పష్టం చేసిన నేపథ్యంలో… మంత్రి మండలి బాధ్యతల కేటాయింపు ఆయన పరిపాలనను మరో దశకు తీసుకెళ్లనుంది.