Kiran Arrest

Kiran Arrest: కిరణ్‌ చేబ్రోలు అరెస్ట్‌తో వేట మళ్లీ మొదలైందా?

Kiran Arrest: ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లుగా సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తల బూతు భాష, అసభ్యకర పోస్టులు సర్వసాధారణంగా మారాయి. టీడీపీ, జనసేన నాయకుల కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత దాడులు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించినా, వందల మంది ట్రోలర్లలో కొద్దిమంది అరెస్టులే జరిగాయి. తాజాగా, పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌పై వైసీపీ అనుకూల ట్రోలర్లు దారుణమైన పోస్టులు పెట్టారు. ఈ ఘటనపై ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదై, కేసు దర్యాప్తులో ఉంది. గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్, ఈ అసభ్యకర పోస్టులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జనసేన నాయకులు హోం మంత్రి వంగలపూడి అనితకు సైతం ఫిర్యాదు చేసి, దుర్మార్గులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వైసీపీ ట్రోలర్లు ఫేక్ ఖాతాలతో మళ్లీ సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారనడానికి ఈ ఘటనే నిదర్శనం అంటున్నారు అనలిస్టులు.

టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్, జగన్ సతీమణి భారతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసి అరెస్టయ్యాడు. చంద్రబాబు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించి, కిరణ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ ఘటన రాజకీయంగా హుందా పాలిటిక్స్‌కు నిదర్శనంగా నిలిచింది. గతంలో వైసీపీ నాయకులు ప్రత్యర్థుల కుటుంబాలను టార్గెట్ చేసినా, చర్యలు ఉండేవి కావు. కానీ, చంద్రబాబు కిరణ్‌పై తక్షణ చర్యలు తీసుకోవడం అటు వైసీపీ, ఇటు టీడీపీ.. రెండు పార్టీల శ్రేణుల్ని షాక్‌కు గురిచేసింది. అయితే కిరణ్‌ అరెస్ట్‌తో… ఇప్పుడు మళ్లీ లైమ్‌ టైట్‌లోకి వస్తోంది మాత్రం చంఢాలమైన, అసభ్యకరమైన భాషతో కూటమి నేతలపై, వారి ఇళ్లలోని ఆడవారిపై దూషణ భాషణలకు పాల్పడిన పలువురు వైసీపీ నేతలు, ఆ పార్టీ అనుకూల సోషల్‌మీడియా ఉన్మాదులే. మరి వారిపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోరు? అన్న ప్రశ్న ఇప్పుడు యావత్‌ టీడీపీ సమాజం ఘంటాపథంగా లేవనెత్తుతోంది. అంతే కాకుండా.. కిరణ్‌ చేబ్రోలుని.. అతనేదో అంతర్జాతీయ టెర్రరిస్టు అన్నట్లు మొఖానికి నల్ల ముసుగు తొడిగి, పోలీసులు ట్రీట్‌ చేసిన విధానం చూసి… పసుపు తమ్ముళ్ల రక్తం ఇప్పుడు లావాలా ఉడిగిపోతోంది.

Kiran Arrest: టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహ జ్వాలల్లా చెలరేగుతున్న ఈ డిమాండ్ల నేపథ్యంలో కిరణ్ చేబ్రోలు అరెస్ట్‌ను కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఉపయోగించుకునే అవకాశం లేకపోలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కిరణ్‌పై తక్షణ చర్యలు తీసుకోవడం ద్వారా, వైసీపీ సోషల్ మీడియా ట్రోలర్లను మరోసారి వేటాడేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్న సంకేతాలు కనిపిస్తున్నాయ్‌. గతంలో పలువరు వైసీపీ కార్యకర్తలు, సినీ నటుడు పోసాని, రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌ లాంటి వారిపై చర్యలు తీసుకున్న ప్రభుత్వం, ఇప్పుడు మిగిలిన వైసీపీ నాయకులను టార్గెట్ చేసే అవకాశం ఉంది. కిరణ్ కేసుతో, “రూల్ ఈజ్ రూల్.. రూల్‌ ఫర్ ఆల్” అనే సందేశం పంపినట్లైందని చెబుతున్నారు విశ్లేషకులు.

Also Read: Janasena Counter To Kavitha: కవిత టాక్స్‌‌.. జనసేన ‘వన్‌ వర్డ్‌’ పంచ్‌

Kiran Arrest: ఈ వ్యూహంతో వైసీపీని ఆత్మరక్షణలోకి నెట్టివేసినట్లు కనిపిస్తోందని అభిప్రాయపడుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక… తొలివిడత సోషల్‌మీడియా అరెస్టులు చేపట్టినప్పుడు… వైసీపీ అవసరానికి మించి గగ్గోలు పెట్టింది. ఇదెక్కడి రాక్షసత్వం అంటూ రాజకీయ లబ్ది, సానుభూతి కోసం ట్రై చేసింది. దాంతో కూటమి ప్రభుత్వం సైతం ఒక అడుగు వెనక్కి వేసి.. కొద్ది మంది సోషల్‌ సైకోల అరెస్టులతోనే సరిపెట్టింది. నిజానికి అప్పట్లో రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు చూపెట్టిన సోషల్‌ సైకోల లిస్టులో ఉన్న వాళ్లంతా అరెస్ట్‌ అయ్యారా అంటే కానే కాదు. ఆ లిస్టు ప్రకారం చూసినా అరెస్టులు అసంపూర్ణంగానే ఉన్నాయ్‌. ఇప్పుడు రెండో విడత అరెస్టులు అదే ఆ లిస్టులో మిగిలిపోయి వారి నుండే మొదలవ్వొచ్చని సమాచారం.

కిరణ్‌ అరెస్ట్‌ని కూటమి వ్యూహాత్మకంగా ఉపయోగించుకుంటే మాత్రం…. కిరణ్ కంటే అత్యంత దారుణంగా మాట్లాడిన వారిపై చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది. ఉదాహరణకు వైసీపీ నాయకుల్లో అయితే గోరంట్ల మాధవ్, అంబటి రాంబాబు, ఆర్కే రోజా, కొడాలి నానీ, జోగి రమేశ్‌, ద్వారంపూడి చంద్రశేఖర్‌, తోపుదుర్తి చంద్రశేఖర్‌ రెడ్డి, రోజా రాణి పేర్లు వినబడుతున్నాయ్. ఇక సోషల్‌మీడియాలో అయితే.. అనితా రెడ్డి, ఇప్పాల రవీంద్రా రెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి, ప్రవీణ్‌ రెడ్డి వంటి పేర్లున్నాయ్‌. ఇక ఇదే సోషల్‌మీడియా ప్లాట్‌ ఫామ్‌లో దొంగ పేర్లు, ఫేక్‌ ఖాతాలు సృష్టించుకుని బూతు పోస్టులు పెడుతున్న.. భార్గవ్‌ ఆర్‌, చిరంజీవి, చైతన్యరెడ్డి, సూర్యకాంతం, అమిగో వంటి వందలాది ఫేక్‌ ఖాతాలను పోలీసులు ఇప్పటికే జల్లెడ పడుతున్నట్లు వార్తలొస్తున్నాయ్‌.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *