Kalthi Liquer Scam: కల్తీ లిక్కర్ స్కామ్‌లో అజ్ఞాత మహిళ ఆడియో కాల్ వైరల్. స్కాంలో బయటపడ్డ మరికొందరి పేర్లు. వివరాల్లోకి వెళితే.. ఏపీకి చెందిన సదరు మహిళకు కర్ణాటక వ్యక్తితో వివాహమైంది. కోవిడ్ సెకండ్ వేవ్‌లో ఆమె భర్త మరణించడం జరిగింది. మహిళ భర్తకు కర్ణాటకలో వ్యాపారాలుండేవట. భర్త చనిపోయాక దేవరింటి రామకృష్ణారెడ్డి అలియాస్ ఆర్కే అలియాస్ పెదబాబుతో ఆ మహిళకు పరిచయం ఏర్పడింది. కొంత కాలం పాటు సహజీవనంలో ఉన్నారట ఆ ఇద్దరూ. ఆర్కే అలియాస్ పెదబాబుది తంబళ్లపల్లె నియోజకవర్గం కన్నమడుగు. పెదబాబు ద్వారానే కల్తీ మద్యం నిందితుడు, టీడీపీ నుండి సస్పెండ్ అయిన జయచంద్రారెడ్డితో మహిళకు పరిచయం ఏర్పడింది. పెదబాబు, జయచంద్రారెడ్డిల మధ్య రిలేషన్ ఏంటో తర్వాత మాట్లాడుకుందాం. వీరిద్దరూ కలిసి ఆ మహిళ దగ్గర 50 లక్షల రూపాయలు డబ్బులు తీసుకుని కల్తీ మద్యం దందాలో పెట్టుబడి పెట్టినట్లు ఆ మహిళ అంటోంది. ఆర్కే అలియాస్ పెదబాబుతో ఆ మహిళ రిలేషన్లో ఉంటుండగా.. తమ వద్దకు గిరిధర్‌రెడ్డి, జయచంద్రారెడ్డి, చల్లా బాబులు వచ్చేవారనీ, వారంతా కలిసి కల్తీ లిక్కర్ గురించి మాట్లాడుకునే వారని ఆ మహిళ లీక్ చేసింది. వీరిలో చల్లా బాబు… పుంగనూరు నియోజకవర్గ టీడీపీ నేత.
Also Read: Narendra Modi: ఈ వారమే ట్రంప్ తో మోడీ వర్చువల్ భేటీ..?
కర్ణాటకలోని కైవారంలో జయచంద్రారెడ్డి, ఆర్కే అలియాస్ చినబాబులకి ఇద్దరికీ కలిపి జంట ఫామ్‌హౌస్‌లు ఉండేవట. వీరిద్దరికీ అంగోలాలో లిక్కర్ కంపెనీలున్నాయని కూడా మహిళ చెబుతోంది. షేర్ ఇస్తామని చెప్పి మహిళ నుండి 50 లక్షలు తీసుకున్న పెదబాబు అండ్ కోని… వారు చేస్తోంది ఇల్లీగల్ బిజినెస్ అని తెలియడంతో ఆ మహిళ డబ్బులు తిరిగివ్వాలని అడిగిందట. దీంతో ఆమె మనుషులతో దాడి చేయించడమే కాక, చంపేస్తామని బెదిరింపులకు పాల్పడినట్లు ఆమె ఆరోపిస్తోంది. కర్ణాటక ఎలహంక, తంబళ్లపల్లెల్లో ఫిర్యాదు కూడా చేసిందట సదరు బాధితురాలు. కర్ణాటక జంట గెస్ట్‌హౌస్‌లలో పెద్ద ఎత్తున కల్తీ మద్యం స్టాక్ పెట్టేవారని, అంగోలాలో లిక్కర్ బిజినెస్‌లు, కర్ణాటకలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కలిసి చేసేవారని, ముకుందా కన్స్ట్రక్షన్స్ పేరుతో బెంగళూరులో రియల్ ఎస్టేట్ కంపెనీ, సూరత్‌లో మ్యాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలు నడిపేవారని, ఏది చేసినా జయచంద్రారెడ్డి, ఆర్కే అలియాస్ పెదబాబు కలిసే చేసేవారని బయటపెట్టింది బాధితురాలు. దీన్ని బట్టి వీరిద్దరూ అత్యంత క్లోజ్ ఫ్రెండ్స్, బిజినెస్ పార్ట్నర్స్ అని తెలుస్తోంది. అయితే ఎన్నికల్లో మాత్రం టిడీపీ టికెట్‌పై పోటీ చేసిన జయచంద్రారెడ్డికి వ్యతిరేకంగా పనిచేశాడట ఆర్కే అలియాస్ పెదబాబు. పబ్లిక్ దృష్టిలో శత్రువులుగా నటిస్తూ, పర్సనల్‌గా ఫ్రెండ్షిప్ చేసేవారని ఆమె చెబుతోంది. జయచంద్రారెడ్డి పక్కా వైసీపీ కోవర్ట్ అని స్పష్టం చేస్తున్నాయి ఆ మహిళ మాటలు.
ఇక అసలు విషయం ఏంటంటే.. జయచంద్రారెడ్డి, రామకృష్ణారెడ్డి ఇద్దరూ గతంలో పెద్దిరెడ్డి అనుచరులే. వీరికి మరో పార్ట్నర్ పుంగనూరు టీడీపీ నేత చల్లా బాబు. అంటే జయచంద్రారెడ్డి, చల్లా బాబులు ఇద్దరూ పెద్దిరెడ్డితో సంబంధాలున్న వ్యక్తులే. చల్లా బాబు పుంగనూరులో టీడీపీ తరఫున పోటీ చేసి పెద్దిరెడ్డిని గెలిపిస్తే… జయచంద్రారెడ్డి తంబళ్లపల్లెలో టీడీపీ తరఫున పోటీ చేసి ద్వారకానాధ్ రెడ్డిని గెలిపించాడనమాట. అలా పెద్దిరెడ్డి సోదరులు తమ అనుచరుల్నే టీడీపీలోకి పంపి, పుంగనూరు, తంబళ్లపల్లెల్లో వారి మీదే గెలిచి ఎమ్మెల్యేలు అయ్యారనమాట. వారితోనే నకిలీ మద్యం తయారు చేయిస్తూ.. లాభాల్లో వాటాలు కూడా తీసుకుంటున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు లిక్కర్ స్కామ్ కేసు నుండి తన కుమారుడు మిధున్ రెడ్డిని కాపాడుకునేందుకు, ప్రభుత్వంపై బురదజల్లేందుకు.. తిరిగి తన ఇద్దరు అనుచరుల్నే రంగంలోకి దింపినట్లు కూడా తెలుస్తోంది. మొత్తానికి నకిలీ మద్యం కేసులో జయచంద్రారెడ్డి పార్ట్నర్గా పెదబాబు, చల్లా బాబుల పేర్లు కొత్తగా తెరపైకి రాగా.. ఆ ఇద్దరిపై ఉండి అంతా నడిపించింది పుంగనూరు పెద్దిరెడ్లు అయిన తండ్రీకొడుకులే అని స్పష్టత వస్తోందంటున్నాయి పొలిటికల్ వర్గాలు.