Jagan High Priority To Kakani: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. సర్వేపల్లి నియోజకవర్గంలో రెండుసార్లు గెలిచిన ఎమ్మెల్యేగా, మాజీ వ్యవసాయ శాఖ మంత్రిగా చాలా మందికి తెలుసు. కానీ కాకాణి తండ్రి రమణా రెడ్డి భూస్వామి. పాత రాజకీయాల్లో గొప్పగా చెప్పుకునే మాజీ సమితి ప్రెసిడెంట్. కాకాణి విషయానికొస్తే ఇంజనీరింగ్ చదివాడు. హైదరాబాద్‌లో పెద్ద బిల్డర్‌గా, రియల్ ఎస్టేట్ వ్యాపారిగా సక్సెస్ అయ్యాడు. వందల కోట్లు ఆస్తులు కూడా ఉన్నాయంటారు. తెలంగాణలో జానారెడ్డి, చిన్నారెడ్డిలతో పాటు చాలా మంది టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ లీడర్స్ కాకాణి గోవర్ధన్ రెడ్డికి క్లోజ్ ఫ్రెండ్స్‌గా, బిజినెస్ పార్ట్‌నర్స్‌గా ఉన్నారట. ఆనం కుటుంబానికి ఫ్యామిలీ ఫ్రెండ్‌గా ఉండే కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. కాంగ్రెస్ పవర్‌లో ఉన్న టైమ్‌లో నెల్లూరు జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా గెలిచి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న టైమ్‌లో చక్రం తిప్పి, నెల్లూరు జిల్లా అంతటా తన పవర్ పెంచుకున్నాడు.
ఆఫ్టర్ వైఎస్ఆర్ డెత్… జగన్ సైడ్ చేరి, వైసీపీలో కీలకమైన లీడర్ అయిపోయాడు. మంత్రి కూడా అయ్యాడు. ఇన్ని పేరు ప్రఖ్యాతులు, ఆస్తులు ఉండి, ఫుల్ క్యాష్ పార్టీగా ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి.. ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయిన ఒక లీడర్, ప్రస్తుతం కార్పొరేటర్ స్థాయిలో ఉన్న మరో లీడర్ మాటలు విని, తెల్లరాయి అక్రమ మైనింగ్ చేస్తే సంచుల నిండా క్యాష్ వస్తుందని టెంప్ట్ అయ్యాడట. తన పొలిటికల్ కెరీర్‌లో ఆ ఇద్దరు లీడర్ల చెప్పుడు మాటలు విని… చెరగని, మాయని మచ్చ తెచ్చుకున్నారని కాకాణి ఫ్యాన్స్ రగిలిపోతున్నారు. మంత్రి పదవి వచ్చిన తర్వాత కాకాణిలో అహంకారం, గర్వం పెరిగిపోయిందని, వైసీపీలో ఆయన చుట్టూ చేరిన భజన బ్యాచ్ వల్ల అనేక ఘోరాలకు, నేరాలకు పాల్పడ్డారని కాకాణి సొంత మనుషులే ఇప్పుడు ఆరోపిస్తున్నారు.
Also Read: SaiReddy Deadly Warning: సావధానంగా చావకొట్టి వదిలిపెట్టిన సాయిరెడ్డి..
Jagan High Priority To Kakani: పవర్‌లో ఉన్నప్పుడు డబ్బు ఆశతో అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ.. వైట్ క్వార్జ్ దోపీడీకి అడ్డంగా వాడేశారట కాకాణి గోవర్ధన్ రెడ్డి. సీన్ కట్ చేస్తే పవర్ పోయింది. పదవులు పోయాయి. చేసిన పాపాలు, కర్మలు వెంటాడాయి. అక్రమ తెల్లరాయి మైనింగ్ కేసులు బలంగా తెరుచుకున్నాయి. తన ప్రత్యర్థి, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. తనకు కాకాణి చేసిన ఘోరమైన అవమానాలకు ప్రతీకారం తీర్చుకోనే రోజులు మొదలైపోయాయి. కేసుల్లో నిందితుడిగా మారిపోయిన తర్వాత కూడా.. కాకాణిని మళ్లీ బ్యాడ్ టైమ్ వెంటాడింది. తప్పుడు సలహాలు ఇచ్చే లాయర్ల మాటలు విని బుక్కయిపోయారట. బెయిల్ వచ్చేస్తుంది, పారిపోండి, మేము మేనేజ్ చేస్తామనగానే.. ఆ మాటలు నమ్మి, దొంగలాగా పారిపోయి, రెండు నెలలుగా తప్పించుకు తిరిగి, అవమానకర రీతిలో పోలీసులకు చిక్కి, చివరకు నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా మారిపోయాడు కాకాణి గోవర్ధన్ రెడ్డి.
ఇంత భయంకరమైన బ్యాడ్ టైమ్స్‌లో కూడా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి జరిగిన మంచి ఏదైనా ఉందంటే అది మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సపోర్ట్‌గా నిలబడటమే. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి… కాకాణి అరెస్ట్ అయ్యి, పోలీసుల అదుపులో ఉన్నప్పటి నుండి… కోర్టుకు హాజరై, తిరిగి నెల్లూరు సెంట్రల్ జైల్‌కు తరలించే వరకు.. మినిట్ టు మినిట్.. కాకాణి యోగక్షేమాలు తెలుసుకున్నారట. జగన్ తన పీఏ కె.ఎన్.ఆర్‌తో.. నెల్లూరు వైసీపీ లీడర్స్‌కు.. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఫోన్‌లు చేయిస్తూ.. కాకాణి గోవర్ధన్ రెడ్డి కేసులో ఏమి జరుగుతోందో ఆరా తీశారట. కాకాణికి ఎలాంటి లీగల్ ఇబ్బందులు లేకుండా చూడాలని సలహాలు, సూచనలు ఫోన్‌లోనే ఇస్తూ… కాకాణి తనకు చాలా ముఖ్యమైన నాయకుడని చాటుకున్నాడట జగన్మోహన్‌రెడ్డి.
Also Read: Mahanadu Day 1 Highlights: మహానాడు వైబ్రేషన్.. గ్రాండ్ తెలుగు సెలబ్రేషన్
Jagan High Priority To Kakani: మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, కాకాణి గోవర్ధన్ రెడ్డిలు మొన్నటి వరకూ ఎడమొహం, పెడమొహంగా ఉండేవారు. కానీ చిత్రంగా కాకాణి క్రిమినల్ కేసుల్లో చిక్కుకుని, పరారైపోయి, పీకల్లోతు కష్టాల్లో కురుకుపోయినప్పటి నుండి ధైర్యంగా కాకాణికి సపోర్ట్ చేసింది అనిల్ యాదవ్ మాత్రమేనట. కాకలు తీరిన లీడర్ అనుకున్న కాకాణికే పారిపోయే పరిస్థితి వచ్చిందంటే.. ఇక మా పరిస్థితి ఏంటని వైసీపీ క్యాడర్ ఒక దశలో సరెండర్ అయిపోయో స్టేజ్‌కు వచ్చేశారట. సరిగ్గా ఆ టైమ్‌లో.. కాకాణికి లైఫ్ ఇస్తూ.. అనిల్ కుమార్ యాదవ్ కూటమి ప్రభుత్వంపై యుద్ధం ప్రారంభించి.. స్టేట్‌లో హడావుడి మొదలు పెట్టారట. కాకాణిపై దొంగ కేసులు పెట్టారనీ, ఇది కక్ష సాధింపని, అసలు తెల్లరాయి దోపీడీ దారులు టీడీపీలో ఉన్న పెద్దమనుషులే అంటూ కాకాణికి మద్దతుగా ప్రభుత్వంపైవిరుచుకుపడటం మొదలు పెట్టారట అనిల్‌కుమార్ యాదవ్. దీంతో వైసీపీలో నోరు తెరవకుండా, మౌన వ్రతం చేస్తున్న నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి లాంటి లీడర్స్ కూడా తప్పక విమర్శలు చేయడం మొదలుపెట్టారట. కాకాణి నెల్లూరు పోలీసుల అదుపులో ఉన్న టైమ్‌లో… అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము వరకు అనిల్ యాదవ్ నిద్ర కూడా పోకుండా.. తన పాత పోలీసు పరిచయాలు, లాయర్ల నెట్‌వర్క్‌తో కాకాణిని సేఫ్‌గా ఉంచడానికి ప్రయత్నించారట. న్యాయవాదులతో సంప్రదింపులు జరిపి.. కాకాణిని రాజమండ్రికి తరలించకుండా నెల్లూరు జైల్‌లోనే ఉంచేలా వర్కవుట్‌లు చేశారట. మొత్తానికి కర్మ కాలి, చీటీ చిరిగి పోయిందనుకున్న టైమ్‌లో వైసీపీ అధినేతలు జగన్, మాజీ మంత్రి అనిల్… కాకాణికి ఫుల్ సపోర్ట్‌గా నిలవడం గోవర్ధన్ రెడ్డి అభిమానుల్లో కొంత ధైర్యాన్ని నింపింది అంటున్నారు.