Jagan Arrest Saval: వైసీపీ అధినేత జగన్ రెడ్డి ఏదో మాయాలోకంలో చిక్కుకున్నారు. ఆయన చెప్పేదే నిజమని, నిజాలు ప్రజల కళ్ల ముందు ఉన్నా, తన మాటలే ఎక్కువ నమ్మిస్తాయని భావిస్తున్నారు. జగన్ అభిమానులు కానీ, చంద్రబాబు వ్యతిరేకులు కానీ.. జగన్ చెప్తోంది అబద్దాలని తెలిసినా, బహిరంగంగా అంగీకరించకపోవచ్చు. జగన్‌కే భజన చేస్తుండొచ్చు. కానీ అది చూసి జగన్.. తన మాటలు నమ్మేస్తున్నారన్న భ్రమల్లోకి వెళ్లిపోతున్నారు. లేదా.. పస లేని కట్టుకథలు, పచ్చి అబద్ధాలతో స్క్రిప్ట్ రాస్తూ.. వైసీపీ స్క్రిప్ట్ రైటర్లు జగన్‌ని నిండా ముంచేస్తున్నారామో ఎవరికీ తెలీదు.
వాస్తవానికి వైసీపీ నేతలకు జగన్ ఆలోచనల స్థాయి, తెలివితేటలు ఏమాత్రమో బాగా తెలుసు. ఆయన నైపుణ్యం కేవలం డబ్బు సంపాదన, అందుకు ఎంచుకునే మార్గాలకే పరిమితం. రాజకీయ అవగాహన, ఇతర విషయాల్లో జగన్‌కు పట్టు లేదు. ఉదాహరణకు, కీలకమైన ఐఏఎస్ అధికారి కాంతిరాణా టాటా పేరు కూడా ఆయనకు గుర్తుండదు. తన హయాంలో చంద్రబాబు అరెస్ట్ అయింది లిక్కర్ కేసులో అని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పులో సగం.. కూటమి ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే చేసేసిందని కాకి లెక్కలేవో చెప్పారు. ఆయనకున్న సబ్జెక్ట్ స్కిల్స్ అంతే. అలాంటి జగన్‌ను కొందరు తమ గుప్పిట్లో పెట్టుకుని, ఒక ఫేక్ హీరోగా, మాయాలోకంలో జీవిగా మార్చేశారేమోనన్న అనుమానాలు కలగక మానదు.
Also Read: Mahanadu Resolution: విపక్ష నేతగా కూడా పనికిరాడు; ‘మహానాడు’ తీర్మానం!
Jagan Arrest Saval: ఇక లిక్కర్ కేసులో అరెస్టు గురించి మీడియా అడిగితే… ‘నేను విజయవాడలోనే ఉన్నా కదా, ఎక్కడికీ పారిపోలేదు కదా.. రమ్మనండి, వచ్చి అరెస్ట్ చేసుకోమనండి’ అంటూ జగన్ రెడ్డి సవాల్ విసిరారు. కానీ, ప్రెస్‌మీట్ ముగిసిన కాస్సేపటికే తాడేపల్లి నుంచి బెంగళూరుకు పరుగులు పెట్టారు. “ఇక్కడే ఉన్నా” అని చెప్పి, ఒక్క రాత్రి కూడా అక్కడ ఉండకపోవడంతో వైసీపీ క్యాడర్ కూడా ఆశ్చర్యంలో మునిగిపోయింది. అరెస్టు భయం జగన్‌ను వెంటాడుతోంది. బెంగళూరులోనైనా, తాడేపల్లిలోనైనా, ఆయన చుట్టూ పోలీసు వాహనాలు కనిపిస్తాయేమోనని భయపడుతున్నారు. సీఐడీ అధికారులు అన్నీ బయటకు తీస్తారని, నేలమాళిగల రహస్యాలు వెలుగులోకి వస్తే తట్టుకోలేమని ఆయన ఆందోళనలో ఉన్నారు. అరెస్టు భయం లేకపోతే, సవాల్ విసిరి బెంగళూరుకు పారిపోయే అవసరం ఏముంది? అయితే, జగన్ అరెస్టు ప్రచారాన్ని వైసీపీ నేతలే ఎక్కువగా చేస్తున్నారు. సోషల్ మీడియాలో జగన్‌ని ఎవడు టచ్ చేసినా వాడి అంతు చూస్తామంటూ, జగన్‌ని అరెస్ట్ చేస్తే రాష్ట్రాన్ని తగలేస్తాం అంటూ బెదిరింపులు గుప్పిస్తున్నారు. కానీ, సీఐడీ నుంచి ఇప్పటివరకూ అరెస్టుపై ఎలాంటి సంకేతాలూ రాలేదు. జగన్ మాత్రం బెంగళూరు ప్యాలెస్‌కి వెళ్లిపోయారు.

