Harihara Pawan Kalyan

Harihara Pawan Kalyan: డిప్యూటీ సీఎం తాలూకా.. యుద్ధానికి సిద్ధమా?

Harihara Pawan Kalyan: ప్రతీ సంవత్సరం జూన్‌ 12 వస్తుంది. కాలక్రమంలో వెళ్లిపోతుంది. కానీ 2025 జూన్ 12 మాత్రం డిప్యూటీ సీఎం హరిహరవీరమళ్లు తాలూక వారికి మాత్రం మదిలో నిలిచిపోతుంది. అభిమాన నటుడు, అరాధించే నాయకుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా భాద్యతలు తీసుకుని జూన్ 12కి ఏడాది పూర్తవుతోంది. జనసేన పార్టీ వ్యవస్ధాపకుడుగా పవన్ కళ్యాణ్ పుష్కరకాలం పాటు పడిన ఇబ్బందులు అన్నీఇన్నీకావు. ప్రత్యర్ది రాజకీయ పార్టీల నుంచి ఎదురైన మాటల తూటలు, కుటంబ సభ్యులను అవహేళన చేస్తూ విమర్శలు, వ్యక్తిత్వ హననం చేయడం.. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. పెట్టవల్సిన ఇబ్బందులన్నీ పెట్టారు.

ఉలి దెబ్బకు శిల ఎలా రాటుదేలుతూ రూపం దాల్చుకుంటుందో.. ప్రతీ ప్రతికూల పరిస్ధితిని తట్టుకుని అతన్ని ఆరాధించే అభిమానుల అండతో, జనసేన క్యాడర్‌ సహాకారంతో 2024 ఎన్నికలలో విజయదుంభిది మోగించాడు. అంతేకాదు కేంద్ర రాష్ట్ర ప్రబుత్వాలలో కీలకంగా మారాడు. దేశ ప్రధాని మోడి సైతం.. పవన్‌ని తుపాన్‌గా పోల్చారు. రాష్ట్రంలో డిప్యూటీ సీఎం హోదాతో పాటుగా.. 5 మంత్రిత్వ శాఖలను పవన్ కళ్యాణ్‌కు సీఎం చంద్రబాబు అప్పగించారు. రాజకీయాల్లో ఎలాగైతే ముక్కుసూటిగా మూందుకెళ్లారో.. నేడుపరిపాలనలో కూడా అదే తత్వంతో తనదైన శైలిలో పాలన సాగిస్తున్నారు పవన్ కళ్యాణ్‌. అలా తాను రాజకీయంగా అధికారంలోకి వచ్చి, డిప్యూటీ సీఎంగా భాద్యతలు స్వీకరించి జూన్ 12కు ఏడాది కావడంతో జనసేన శ్రేణులు సంబరాలకు సిద్దమౌవుతున్నారు.

అనుకుని ప్రకటించారో… అనుకోకుండా జరిగిందో తెలియదు కానీ, జూన్ 12న హరిహరవీరమల్లు విడుదల చేస్తున్నట్లు వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. ఇంకేముంది.. పవర్ స్టార్‌ అభిమానులకు పండుగే. 2020 నుంచి పవర్ స్టార్ అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. 2021 తర్వాత పవర్ స్టార్ సిల్వర్ స్క్రీన్ మీద కనిపించలేదు. తమ హీరో ఎప్పుడెప్పుడు మళ్లీ తెరమీద కనిపిస్తాడా అని ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 12న హరిహరవీరమల్లు సినిమా విడదులకు దాదాపుగా రంగం సిద్దమైంది. తెలుగులోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా 5 భాషలలో పవన్ సందడి చేయనున్నారు. ఒక వీరయోధుడి పాత్రలో పవన్ ఇందులో నటించారు. హరిహరవీరమల్లు సినిమా మేకింగ్‌ మూడు అడుగులు ముందుకు పడితే, ఆరడుగులు వెనక్కి పడింది. ఎందుకంటే పవన్ ఒకవైపు రాజకీయాలలో బిజీగా మారి, సినిమాలకు డేట్స్ కేటాయించలేకపోయారు. అనేక సందర్బాలలో తన పొలిటికల్ జర్నీలోనే డబ్బింగ్ వంటివి చెప్పాడంటే పవన్ చిత్తశుద్దిని అర్దం చేసుకోవచ్చు. పగలంతా పర్యటనలు, సమావేశాలు జరిపి.. రాత్రి షూటింగ్‌కి హాజరైన సందర్బాలూ ఉన్నాయి. అయినా చివరకు సినిమా అనుకున్నదానికన్నా ఆలస్యమైంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న హరిహరవీరమల్లు.. పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. జూన్ 12న వెండితెరపై పవన్ మానియా తప్పదంటున్నారు ట్రేడ్‌ పండితులు.

ALSO READ  Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్‌ సినిమాలనే టార్గెట్ చేస్తున్నారా?

Also Read: PSLV-C61 ప్రయోగంలో సాంకేతిక సమస్య.. మూడోదశలో గుర్తించిన ఇస్రో..!

Harihara Pawan Kalyan: అభిమానులకు పవన్ అంటే దైవంతో సమానం. జనసేనానిగా కూడా ప్రజల గుండెల్లో అదే స్ధానం సొంతం చేసుకుంటున్నాడు పవన్. మెగా బ్రదర్‌గా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి కళ్యాణ్ బాబు కాలు పెట్టినా… కొద్దిరోజులకే తన విలక్షణ నటనతో ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా పవర్ స్టార్‌గా మారిపోయారు. తక్కువ సినిమాలే చేసినా, అందులో కొన్ని ప్రేక్షకాదరణ పొందలేకపోయినా, పవన్ మాత్రం అభిమానుల గుండెళ్లో గుడులు కట్టేసుకున్నాడు. కాలక్రమంలో అభిమానులు పవన్‌ను దైవంగా కొలిచే స్థాయికి ఎదిగిపోయారు. దేశంలో వేలాది మంది శాసనసభ్యులుగా భాద్యతలు నిర్వర్తించారు.వందల మంది డిప్యూటీ సీఎంలుగా భాద్యతలు నిర్వర్తించి ఉంటారు. కానీ పవన్ పిఠాపురం ఎమ్మేల్యేగా పోటీ చేస్తేనే.. అతని అభిమానులు పిఠాపురం ఎమ్మేల్యేగారి తాలుకా అని హల్ చల్ చేసారంటే పవన్‌పై వారికున్న అభిమానాన్ని అర్దం చేసుకోవచ్చు. ఇక డిప్యూటీ సీఎంగా భాద్యతలు తీసుకున్న తర్వాత.. ఒకరిద్దరు శాసనసభ్యులు, సభా వేదిక మీద రాధికా లాంటి సీనియర్ నటీమణులు సైతం.. మేము డిప్యూటీ సీఎం తాలుకా అన్నారంటే ఆ మానియా గురించి మనం ఎంత చెప్పినా తక్కువే.

డిప్యూటీ సీఎం గారి తాలుగా సినిమా హరిహరవీరమల్లు విడుదల అవుతోంది అంటే సిల్వర్ స్క్రీన్స్ పొజిషన్ ఒక్కసారి ఊహించుకోండి. అందులో డిప్యూటీ సీఎంగా పవన్ భాద్యతలు తీసుకుని ఏడాది అవుతున్న రోజున.. ఇంకేముంది.. తెలుగు రాష్ట్రాలలో పవన్ మానియానే.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *