Govindappa: లిక్కర్ కేసులో కధ అడ్డం తిరిగింది! లిక్కర్ స్కామ్‌లో జగన్ సన్నిహితుల పాత్రని బయటపెడుతూ నాటి అధికారులు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్లు ఇప్పుడు కీలకంగా మారాయి. లిక్కర్ సిండికేట్‌లో భారతి సిమెంట్ ఆడిటర్ బాలాజీ గోవిందప్ప కూడా భాగమేనని, గోవిందప్ప పాత్రని క్లియర్ కట్‌గా వెల్లడించారు వాసుదేవ రెడ్డి, సత్య ప్రసాద్‌లు. వీరి స్టేట్మెంట్ల ఆధారంగా రాజ్ కసిరెడ్డితో కలిసి వాళ్ళు చెప్పిన డిస్టిలరీలకే ఆర్డర్లు ఇవ్వమని గోవిందప్ప ఒత్తిడి తెచ్చినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ముఖ్యంగా ముడుపుల కలెక్షన్ వ్యవస్థ ఏర్పాటులో గోవిందప్ప కూడా భాగమేనని, కాచారంలో దొరికిన రూ.11 కోట్లు లిక్కర్ సొమ్మేనని సిట్ తేల్చింది.
ఈ నెల 18న జగన్ సన్నిహితులు బాలాజీ గోవిందప్ప, కె.ధనుంజయ్ రెడ్డి, క్రిష్ణ మోహన్ రెడ్డి బెయిల్ తిరస్కరించిన ఏసీబీ కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. 2019-24 మధ్య జరిగిన లిక్కర్ వ్యాపారం మొత్తం ఇద్దరు అధికారుల మీద నడిచింది. ఇందులో ఒకరే డెప్యుటేషన్ మీద వచ్చిన డి.వాసుదేవ రెడ్డి. జగన్ ప్రభుత్వం ఈయనకు బెవరేజస్ కార్పొరేషన్ ఎండీ, డిస్టిలరీస్ కమిషనర్ బాధ్యతలు అప్పగించింది. ఇక ఎక్సైజ్ శాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా పని చేసిన సత్యప్రసాద్‌ను బెవరేజస్ కార్పొరేషన్లోకి తీసుకొచ్చిన జగన్ ప్రభుత్వం… బెవరేజస్ కార్పొరేషన్లో స్పెషల్ ఆఫీసర్ హోదాలో డిస్టిలరీలకు లిక్కర్ సరఫరా ఆర్డర్లు ఇచ్చే పూర్తి అధికారాన్ని సత్య ప్రసాద్‌కు అప్పగించింది. ఈ ఇద్దరుతోటే లిక్కర్ సిండికేట్ చక్రం తిప్పింది. ఇప్పుడు వారిద్దరూ ఇక్కర్ సిండికేట్‌లో జగన్ సన్నిహితుల బాగోతాన్ని వెల్లడించారు.
Also Read: Minister Lokesh: మహిళా డ్రైవర్లకు ర్యాపిడో భాగస్వామ్యంలో ఉపాధి: లోకేష్ హర్షం
తాను ప్రైవేట్ వ్యక్తినని, లిక్కర్ వ్యవహారంతో తనకు అసలు సంబంధమే లేదని భారతి సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప ఏసీబీ కోర్టులో వాదించారు. అయితే ఫిబ్రవరిలో సత్య ప్రసాద్, వాసుదేవ రెడ్డి…ఇద్దరూ కూడా బాలాజీ గోవిందప్ప లిక్కర్ సిండికేట్‌లో భాగం అయ్యారని సిట్ రికార్డు చేసిన స్టేట్మెంట్లో చెప్పేశారు. బాలాజీ గోవిందప్ప.. రాజ్ కసిరెడ్డి, ఇతర నిందితులతో కలిసి తాము చెప్పిన డిస్టిలరీలకే మద్యం సరఫరా ఆర్డర్లు ఇవ్వమని ఒత్తిడి తెచ్చారనీ తెలిపారు. నిందితుల కన్ఫెషన్ స్టేట్ మెంట్ పరిగణనలోకి తీసుకోరాదని బాలాజీ గోవిందప్ప వాదించినా వారి స్టేట్మెంట్ కీలకంగా మారింది. బాలాజీ గోవిందప్ప పాత్ర ఉందని రూఢి కావడంతో లిక్కర్ కేసు జగన్‌కు మరింత చేరువయ్యింది.

