Bhumanaki TTD Big Shock: టీటీడీలో మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి హయాంలో చేపట్టిన పనులపై స్కానింగ్ జరుగుతోంది. గత పాలకమండలి తీసుకున్న భవన నిర్మాణాల పనులన్నింటినీ నిలిపివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం టీటీడీని ఆదేశించింది. కాంట్రాక్ట్ వర్క్స్ కోసం బాగా ఉన్న భవనాలను కూడా పడగొట్టి కొత్తవి కట్టడానికి అనుమితించారని అభియోగాలున్న నేపథ్యంలో.. నాటి టీటీడీ నిర్ణయాలను సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. కరుణాకర్ రెడ్డి హయంలో అనుమతులు ఇచ్చిన పనులన్నింటిపైనా విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ విచారణ తర్వాతే ఈ పనుల విషయంలో ముందుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక సీఎం ఆదేశంతో దాదాపు 1600 కోట్ల మేర బిల్లుల్ని కూడా నిలిపివేసింది టీటీడీ. నిర్మాణంలో ఉన్న గోవిందరాజులు సత్రాలు, పద్మావతి చిన్నపిల్లల హాస్పిటల్, స్విమ్స్ పునర్నిర్మాణ పనులు, తిరుమలలోని పీఏసీ 5 భవన నిర్మాణ పనులను ఆపివేయాలంటూ టీటీడీ చైర్మన్ ఆదేశాలు జారీ చేశారు. టీటీడీ నిర్ణయంతో లబోదిబోమంటున్నారు కాంట్రాక్టర్లు. గత ఎన్నికలకు ముందు హడావిడిగా టెండర్ వర్క్స్ పిలిచింది భూముల కరుణాకర్ రెడ్డి నేతృత్వంలోని పాలకమండలి. ఇప్పుడు ఆ అక్రమాలన్నింటినీ కూటమి ప్రభత్వం బయటకు తీస్తోంది.
ఇక రెండు సార్లు టీటీడీ బోర్డు ఛైర్మన్‌గా, రెండు సార్లు తిరుపతి ఎమ్మెల్యేగా, ఓసారి తుడా ఛైర్మన్‌గా పనిచేసిన భూమన కరుణాకరరెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకొని అనేక అరాచకాలు, అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి ఎమ్మెల్యేగా, టీటీడీ బోర్డు ఛైర్మన్‌గా ఏకకాలంలో జోడు పదవులు నిర్వహించినప్పుడు… ప్రభుత్వ భూముల్ని, నదీ పరీవాహక ప్రాంతాన్నీ భూమన కబ్జా చేసేశారన్న ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దర్యాప్తులో విస్తుగొలిపే విషయాలు బయటకు వచ్చాయి. తిరుపతిలో 16.30 ఎకరాల ప్రభుత్వ, ఇనాం భూముల్ని, స్వర్ణముఖి పరీవాహక ప్రాంతాన్ని ఆక్రమించినట్టు విజిలెన్స్ నిగ్గు తేల్చింది. 3.07 ఎకరాల ప్రైవేటు భూమినీ కబ్జా చేసినట్టు పేర్కొంది. ఆ భూముల బహిరంగ మార్కెట్ విలువ రూ.150 కోట్లకుపైనే ఉంటుందని అనధికారిక అంచనా. విజిలెన్స్ నివేదిక ఆధారంగా విచారణకు ఆదేశించారు రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్.
తిరుపతి అర్బన్ మండలంలోని మంగళం గ్రామం పరిధిలో తిమ్మినాయుడిపాలెం బైపాస్ రోడ్డుకు దగ్గర్లో 7.30 ఎకరాల ప్రభుత్వ భూమిని భూమన కబ్జా చేసినట్టు విచారణలో తేలింది. ఇందులో 5 ఎకరాల్ని మొదట ఆక్రమించి తుడా నిధులతో 80 అడుగుల రహదారి నిర్మాణం తలపెట్టారని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తెలిపింది. దారి నిర్మించాక మరో 2.30 ఎకరాల్ని ఆక్రమించినట్టు పేర్కొంది. సర్వే నం.47-2లోని మరో 3.07 ఎకరాల ప్రైవేటు భూమినీ యజమానుల్ని బెదిరించి కబ్జా చేశారని విజిలెన్స్ పేర్కొంది. ప్రస్తుతం సర్వే నం.47లో మొత్తం 10.37 ఎకరాలు భూమన కబ్జాలో ఉన్నట్టు తెలిపింది. బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం భూమన కబ్జా చేసిన ప్రభుత్వ, ప్రైవేటు భూముల విలువ రూ.100 కోట్ల పైమాటే.
Also Read: War Begins Pak Reaction: పాక్ ఉగ్ర శిబిరాలపై భారత్ ‘సిందూర్’ సిరీస్
Bhumanaki TTD Big Shock: ఇక తిరుపతి రూరల్ మండలంలోని తిరుచానూరు పరిధిలో సర్వే నంబరు 472, 473లలో ఇనాం, స్వర్ణముఖి పరీవాహక భూముల్ని భూమన కుటుంబం చెరబట్టినట్టు శాటిలైట్ పాత చిత్రాలు, రెవెన్యూ రికార్డుల ఆధారంగా విజిలెన్స్ నిర్ధారించింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం తిరుచానూరులోని 472, 473, 474 సర్వే నంబర్లలో భూమన కరుణాకరరెడ్డి భార్య జె.రేవతి, కుమారుడు బి.అభినయ్‌ల పేర్ల మీద 15.36 ఎకరాల భూమి ఉంది. కానీ, అవే సర్వే నంబర్లలో ప్రస్తుతం భూమన కుటుంబానికి 24.36 ఎకరాల్లో మామిడి తోట ఉందని, దాని చుట్టూ ప్రహరీ నిర్మించారని విజిలెన్స్ విభాగం గుర్తించింది. అంటే.. అదనంగా 9 ఎకరాల ఇనాం భూముల్ని, నదీ పరీవాహక ప్రాంతాన్ని ఆక్రమించారని దర్యాప్తులో భాగంగా స్థానికులు చెప్పినట్టు తెలిపింది. శాటిలైట్ పాత చిత్రాలూ ఆక్రమణను నిర్ధారిస్తున్నట్లు విజిలెన్స్ తెలిపింది. నదీ పరీవాహకంలోకి చొచ్చుకెళ్లి ప్రహరీ నిర్మించే క్రమంలో అక్కడ భూమిని మెరక చేసేందుకు లక్ష టన్నుల గ్రావెల్, మట్టి తీసుకొచ్చినట్టు తేలింది. భూమన కుటుంబం ఆక్రమణలోని ఈ 9 ఎకరాల భూమి సుమారు రూ.54 కోట్లు ఉంటుందని అంచనా.
కొండపైన చేపట్టిన వర్కులపై విజిలెన్స్ స్కానింగ్.. కొండ కింద భూ కబ్జాలపై విచారణ.. గోమరణాలపై అసత్య ప్రచారాలపై నమోదైన కేసు.. ఇలా పాపాలన్నీ చుట్టుముడుతున్న వేళ.. భూమన ముఖచిత్రం త్వరలో శ్రీకృష్ణ జన్మస్థానమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. చూడాలి మరి ఏమౌతుందో.

