Balayya Minister Dream

Balayya Minister Dream: బాలయ్య ఫాన్స్‌కి ‘కల’గానే ‘మంత్రి పదవి’

Balayya Minister Dream: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపూర్ నియోజకవర్గం అంటేనే టీడీపీ నందమూరి కుటుంబమే గుర్తొస్తుంది… 1983 సంవత్సరంలో టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి స్వర్గీయ అన్న నందమూరి తారకరామారావు, హరికృష్ణ… నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా స్థానిక ప్రజలు గెలిపిస్తూనే… నందమూరి కుటుంబం నుంచి అక్కడ ఎవరు పోటీ చేసినా, అప్పుడు కాంగ్రెస్ గానీ, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష రూల్‌కు మాత్రమే పరిమితం కావాల్సిందే…. ఎన్ని విశ్వప్రయత్నాలు చేసినా అక్కడ మాత్రం టీడీపీకి ఓటమి అనేది తెలియదు. ఎందుకంటే హిందూపురం అంటే నందమూరి, నందమూరి అంటే హిందూపురం అనే విధంగా ప్రజలతో ఆ కుటుంబం మమేకమై ఉంది…. నందమూరి బాలకృష్ణ 2014లో అక్కడ రాజకీయం నుంచి ఆరంభం చేసి వరుసగా హ్యాట్రిక్ విజయం సాధించారు…. అయితే బాలయ్య అభిమానుల కోరిక మాత్రం నెరవేరట్లేదు…. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి అడుగుపెట్టినా, మంత్రి హోదాలో చూడాలనేది హిందూపురం నియోజకవర్గ ప్రజలు, అదేవిధంగా బాలయ్య అభిమానుల, ఫ్యాన్స్ కోరిక.

సినిమా రంగం నుంచి అనేకమంది రాజకీయ అరంగేటం చేసి, ఏకంగా ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులుగా పదవులు చేపట్టారు… మా ఆరాధ్య దైవం నందమూరి బాలకృష్ణను మంత్రి హోదాలో చూడాలనేది ఫ్యాన్స్ కోరిక అంట… ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం మొదటిసారిగా హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, శాసనసభలో అధ్యక్షుడిగా గొంతు వినిపించారు బాలయ్య…. హిందూపూర్ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి ఎలా ఉండాలో చూపించారు…. 2019లో జగన్ వైసీపీ గాలిలో కూడా అక్కడ మాత్రం నందమూరి బాలకృష్ణ హవానే కొనసాగింది… 2024 ఎన్నికల్లో బాలయ్య 30 వేల పైచిలుకు భారీ విక్టరీ నమోదు చేశారు… ఎన్డీఏ కూటమిలో ప్రభుత్వం కేబినెట్ బెర్త్ గ్యారెంటీ అని, మా బాలయ్యను మంత్రి హోదాలో చూడబోతున్నామంటూ ఫ్యాన్స్‌కు ఎక్కడో ఒక చిన్న ఆశ ఉండేది… అయితే కూటమిలో జనసేన, బీజేపీ, టీడీపీ మూడు పార్టీల వివిధ సమీకరణాల నేపథ్యంలో క్యాబినెట్ మొదటి విస్తరణలో మంత్రి పదవి దక్కలేదు… బాలయ్య ఫ్యాన్స్, హిందూపూర్ నియోజకవర్గ ప్రజలకు నిరాశే ఎదురైందని చెప్పవచ్చు.

Also Read: jubliee hills By elections 2025: జూబ్లీహిల్స్ కాంగ్రెస్‌లో 40 మంది స్టార్ క్యాంపెయిన‌ర్లు వీరే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దాదాపు రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న తరుణంలో, ఎప్పుడైనా రెండో విడత క్యాబినెట్ విస్తరణ జరిగితే మాత్రం ఈసారి మా నందమూరి నరసింహానికి క్యాబినెట్‌లో మంత్రి పదవి ఇవ్వాలంటూ ఇప్పటి నుంచే హిందూపూర్ నియోజకవర్గ ప్రజలు గళం వినిపించడానికి సిద్ధమయ్యారు…. మొన్న నందమూరి బాలకృష్ణ నియోజకవర్గంలో మూడు రోజులు పర్యటన చేస్తూ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు… నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు… అయితే హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు చేదు అనుభవం ఎదురైందని చెప్పవచ్చు… ఆయన ఫ్యాన్స్, తెలుగు తమ్ముళ్లు ప్లకార్డులు పట్టుకొని బాలయ్యను అడ్డుకున్నారు… వచ్చే మంత్రివర్గ విస్తరణలో బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు కార్యకర్తలు… బాలకృష్ణ వారందరి దగ్గరికి వచ్చి కార్యకర్తలను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు…. బాలయ్య ఫ్యాన్స్, కార్యకర్తలు మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చే వరకు మేము విడుదలవారీగా ఈ ఆందోళన చేపడుతామని బాలయ్యకు కరాకండిగా చెప్పినట్టు తెలుస్తోంది.

హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ వరుసగా హ్యాట్రిక్ విజయాలు సాధించడంతో, ఇండియా కూటమి ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రి హోదా బాలయ్యను చూడాలనేది ఫ్యాన్స్, ఆయన కార్యకర్తల కోరిక…. బాలకృష్ణ అసెంబ్లీలో మొన్న రెండు రోజులు అటెండ్ అవుతేనే రాష్ట్ర రాజకీయాలు షేక్ అయ్యాయని చెప్పొచ్చు….. ఇక బాలకృష్ణకు మంత్రి పదవి ఇస్తే రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉంటాయో ఊహించడమే కష్టం…. ఏది ఏమైనా, ఇప్పటికే చిరంజీవి కేంద్రమంత్రి హోదాలో పనిచేశారు, ఇక పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్నారు…. నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా బాలయ్యను క్యాబినెట్ హోదాలో మంత్రిగా చూడాలనేది వారి కల… మరి బాలయ్య ఫ్యాన్స్, కార్యకర్తల కోరిక నెరవేరుతుందా లేదా అనేది వెయిట్ అండ్ సీ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గమనిక: అక్షర దోషాలు, పంక్చువేషన్ మాత్రమే సరిచేయబడ్డాయి. కంటెంట్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. బాలయ్య ఫ్యాన్స్ కళ చంద్రబాబు నెరవేరుస్తారా..!

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *