Avinash Reddy in liquor scam: లిక్కర్ స్కామ్‌కి సంబంధించి తవ్వేకొద్ది సంచలనాలు బయటపడుతున్నాయి. తాజాగా లిక్కర్ స్కామ్‌లో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సిట్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. లిక్కర్ పాలసీ రెడీ చేయడంలో, డిస్టలరీలను బెదిరించడంలో కీలకంగా వ్యవహరించింది కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, మరో వ్యక్తి హనుమంత్ రెడ్డిలేనని సిట్ ఆధారాలు సంపాదించిందట. అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని ఏసీబీ కోర్టులో సిట్ పిటిషన్ వేసినట్లు సమాచారం. డిస్లరీలను లొంగదీసుకోవడంలో తండ్రీకొడుకులదే కీ రోల్ అంటోంది సిట్. అయితే వీరి ప్రమేయంపై ఆధారాలు చూపించాలని కోరిన ఏసీబీ కోర్టుకు సిట్ త్వరలోనే కీలక నివేదిక అందించనున్నట్లు సమాచారం.
ఇక బంజారాహిల్స్‌లోని భారతి సిమెంట్ కార్యాలయంలో సిట్ సోదాలు కొనసాగిస్తోంది. భారతి సిమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులో డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఏపీ లిక్కర్ స్కాం భారతి సిమెంట్ కేంద్రంగా నడిచిందన్న అనుమానాలున్నాయి. ఇప్పటికే భారతి సిమెంట్స్‌లో డైరెక్టర్ట్‌గా ఉన్న బాలాజీ గోవిందప్పను అరెస్ట్ చేసింది సిట్. హైదరాబాదులో లిక్కర్ డబ్బులు ఉంచిన 6 డెన్లకు కూడా భారతి సిమెంట్ నుండే ముడుపులు తరలించినట్లు సిట్ గుర్తించింది. భారతీ సిమెంట్స్ ఆఫీస్‌లోనే లిక్కర్ సరఫరాదారులు, డిస్టలరీల యజమానులతో సమావేశాలు జరిగినట్లుగా కూడా సిట్ చెబుతోంది.
Also Read: Indiramma Canteens: ఆగస్టు 15 నుంచి ఇందిరమ్మ క్యాంటీన్లు రెడీ.. మెనూ, కేంద్రాలూ చేంజ్!
యిస్ ఓవర్ 3ఇక లిక్కర్ స్కామ్ ద్వారా కొల్లగొట్టిన డబ్బులతో రాజ్ కసిరెడ్డి ఒక్కడే సినిమాలు తీశాడని ఇప్పటిదాకా అనుకున్నారంతా. కానీ అదే తరహాలో మరో నిందితుడు చాణక్య బూనేటి సైతం సినిమాలు తీశాడని తెలుస్తోంది. రాజ్ కసిరెడ్డి కంటే.. ఈ చాణక్య ఒక ఆకు ఎక్కువే చదివాడు. రాజ్ కసిరెడ్డి రెండు సినిమాలు నిర్మిస్తే.. ఈయన మూడు సినిమాలకు లిక్కర్ డబ్బును ఖర్చుపెట్టినట్లు సిట్ గుర్తించింది. చందమామ కథలు, ఎల్‌బీడబ్ల్యూ, రొటీన్ లవ్‌స్టోరీ సినిమాలకు నిర్మాణ బాధ్యతలు వహించి బూనేటి చాణక్యనే అట. ఈ మూడు సినిమాలకు దర్శకత్వం వహించింది ప్రవీణ్ సత్తార్. ప్రవీణ్ సత్తార్ మరెవరో కాదు… చాణక్య బూనేటి సొంత బావమరిదేనట. తెలంగాణలో టీ గ్రిల్ అనే సంస్థకు యజమానిగా కూడా ఉన్నారు ఈ బూనేటి చాణక్య. సిట్ 3500 కోట్లకు మాత్రమే ఆధారాలు సేకరించింది కానీ.. ఈ సినిమాలు, సిమెంట్ కంపెనీల ఇన్వాల్మెంటు చూస్తుంటే.. ఈ స్కామ్ ఎవరూ ఊహించనట్లుగా కొన్ని వేల కోట్ల రూపాయలు ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.