Baahubali

Baahubali: బాహుబలి రీ-రిలీజ్.. షాకిస్తున్న రన్ టైం!

Baahubali: తెలుగు సినిమా స్థాయిని దేశవ్యాప్తంగా చాటిన బాహుబలి మళ్లీ థియేటర్లలో సందడి చేయనుంది. ఈ ఏడాదితో పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఈ ఎపిక్ చిత్రం రీ-రిలీజ్‌కు రెడీ అవుతోంది. అక్టోబర్ 31న విడుదల కానున్న ఈ చిత్రం, బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2ని కలిపి ‘బాహుబలి – ది ఎపిక్’గా రూపొందింది. ఈ ఒక్క చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు ఏకంగా 5 గంటల 20 నిమిషాలకు పైగా రన్‌టైం నిర్ణయించినట్టు సమాచారం.

Also Read: KD-The Devil: కేడీ ది డెవిల్ మూవీ టీజర్ లాంచ్.. పాల్గొన్న సంజయ్ దత్

ఈ భారీ రన్‌టైం నిజమైతే, ప్రేక్షకులకు సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అదిరిపోనుంది. ఈ రీ-రిలీజ్‌లో ఎలాంటి సర్‌ప్రైజ్‌లు ఉంటాయన్నది ఆసక్తికరం. రాజమౌళి టీమ్ ఈ విషయంలో స్పష్టత ఇవ్వాల్సి ఉంది. మొత్తానికి ఇంత భారీ ప్రాజెక్ట్‌తో మళ్లీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించేందుకు బాహుబలి టీం సిద్ధమవుతోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *