Sabarimala

Sabarimala: రేపటితో ముగియనున్న అయ్యప్ప దర్శనం!

Sabarimala: జనవరి 14న శబరిమలలో మహాజ్యోతి దర్శనం జరిగింది. డిసెంబర్ 31న ప్రారంభమైన నెయ్యభిషేకం ఈరోజు (జనవరి 18) ఉదయం 10:30 గంటలకు ముగియనుంది. అనంతరం కలశాభిషేకం నిర్వహిస్తారు. రేపు (జనవరి 19) రాత్రి 10:00 గంటల వరకు మాత్రమే భక్తులకు దర్శనం ఉంటుంది. పాదయాత్రలో వచ్చే భక్తులను రేపు సాయంత్రం 6:00 గంటల వరకు మాత్రమే సన్నిధానం దర్శనానికి అనుమతిస్తారు. జనవరి 20న ఉదయం 5:00 గంటలకు గణపతి హోమం నిర్వహిస్తారు. అనంతరం పందళం రాజు ప్రతినిధి రాజరాజ వర్మ అయ్యప్పను దర్శించుకోనున్నారు. మేల్ శాంతి అరుణ్‌కుమార్ నంబూద్రి రాజు ప్రతినిధి సమక్షంలో అయ్యప్పను యోగ భంగిమలో ఉంచి 18 మెట్లు దిగుతారు.అక్కడ, రాజు ఆలయానికి తాళం వేసి, డబ్బును ప్రతినిధికి చెల్లిస్తాడు. వాటిని ఆలయ నిర్వాహకులకు ఇచ్చి పూజలు సక్రమంగా నిర్వహించాలని చెప్పి తిరువాపరాలతో తిరిగి వెళ్ళిపోతారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *