Hyderabad News: హైదరాబాద్ నగరంలో రోజుకో చోట అగ్నిప్రమాద ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. కూకట్‌పల్లిలో ఓ హోటల్, షేక్‌పేటలో ఓ విద్యా సంస్థల్లో అగ్నిప్రమాద ఘటనలను మరువక ముందే హబ్సిగూడలో మరో భవనంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. తీవ్ర ఆస్తినష్టం సంభవించింది.
Hyderabad News: హబ్సిగూడలోని విజయలక్ష్మి ఆర్కేడ్‌లో ఓ చిట్‌ఫండ్స్ కార్యాలయం ఉన్నది. ఎప్పటిలాగే శనివారం ఉదయం కార్యాలయ షెట్టర్ తీస్తుండగా, విద్యుత్ షాక్‌తో ఇద్దరు సిబ్బంది అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు సూర్యాపేట జిల్లాకు చెందిన మల్లేశ్ (29), బాలు (32)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. హబ్సిగూడలోని విజయలక్ష్మి ఆర్కేడ్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇద్దరు మృతి చెందడంతో పాటు కార్యాలయంలో సామగ్రి దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఆస్తినష్టం సంభవించింది.