Ayyannapatrudu: అనకాపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. దొంగ పెన్షన్ల అంశంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను స్పీకర్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలో మూడు లక్షల 20 వేల మందికి దొంగ పెన్షన్లు మంజూరు అవుతున్నాయని తేలింది. తప్పుడు వయసు ధ్రువపత్రాలు సృష్టించి నెలకు రూ. 120 కోట్ల మేర ప్రభుత్వానికి నష్టం కలిగిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ నష్టం సంవత్సరానికి రూ. 1440 కోట్లు, ఐదేళ్లకు రూ. 7200 కోట్ల వరకు పెరుగుతుందని వివరించారు. ఈ సొమ్ముతో రాష్ట్రానికి మూడు తాండవ రిజర్వాయర్లను నిర్మించవచ్చని ఆయన పేర్కొన్నారు.
“దొంగ పెన్షన్ తీసుకుంటున్న వారు దొంగలే,” అని స్పష్టం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో కూడా చర్చించానని, ఆయన స్పందన చూడాలని ఆయన అన్నారు.
తన ప్రసంగంలో అవినీతి, దొంగిలింపులపై స్పష్టమైన అభిప్రాయాన్ని అయ్యన్నపాత్రుడు వ్యక్తం చేశారు.

