Ayushman Cards: 10 లక్షల మందికి పైగా సీనియర్ సిటిజన్లు ఆయుష్మాన్ వయ వందన కార్డు కింద నమోదు చేసుకున్నారు. AB PM-JAY కింద, ఈ పథకం ప్రారంభించిన మూడు వారాల్లోనే రికార్డు స్థాయి నమోదు జరిగింది. ఇది మాత్రమే కాదు, ఇప్పటి వరకు ఆయుష్మాన్ వయో వందన కార్డు కింద దాదాపు 4 లక్షల మంది మహిళలు క్లెయిమ్స్ వేశారు.
ఆయుష్మాన్ వయో వందన కార్డ్ ప్రారంభించినప్పటి నుండి 9 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన చికిత్స అందించారు. ఇందులో 70 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయోస్సు గల 4800 కంటే ఎక్కువ మంది సీనియర్ సిటిజన్లు ఉన్నారు. అదే సమయంలో, ఈ పథకం కింద 1400 మందికి పైగా మహిళలు ఉచిత ఆరోగ్య సౌకర్యాలను పొందారు. ప్రధాని మోదీ 29 అక్టోబర్ 2024న ఈ కార్డును ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: Israile: ప్రధాని నివాసం పై బాంబు దాడి
Ayushman Cards: ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB PM-JAY) కింద 70 ఏళ్లు పైబడిన వ్యక్తులు ఈ సౌకర్యాలకు లింక్ అయ్యారు. ఆయుష్మాన్ వయో వందన కార్డ్ ప్రారంభించినప్పటి నుండి, 9 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన వైద్య చికిత్స అందించారు. పీఐబీ విడుదల చేసిన నివేదిక ప్రకారం కేవలం మూడు వారాల్లోనే 4,800 మందికి పైగా సీనియర్ సిటిజన్లు ఈ పథకం కింద లబ్ధి పొందారు. ఇందులో 1,400 మందికి పైగా మహిళలు ఉన్నారు.
ఇప్పటివరకు ఆయుష్మాన్ వయో వందన కార్డుపై క్యాటరాక్ట్ ఆపరేషన్ నుండి స్ట్రోక్ వంటి అనేక వ్యాధులకు చికిత్స అందించారు. ఈ చికిత్సలలో కరోనరీ యాంజియోప్లాస్టీ, హిప్ ఫ్రాక్చర్ లేదా రీప్లేస్‌మెంట్, క్యాటరాక్ట్ ఆపరేషన్, ప్రోస్టేట్, స్ట్రోక్ వంటి అనేక ఇబ్బందులకు సంబంధించినవి ఉన్నాయి.