Israile: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంటిపై బాంబు దాడి జరిగింది. ఘటన సమయంలో నెతన్యాహు, ఆయన కుటుంసభ్యులు ఇంట్లో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.సిజేరియా పట్టణంలోని నెతన్యాహు ఇంటిపై రెండు ఫ్లాష్ బాంబులతో దాడి జరగడంతో భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. ప్రధాని నివాసంపై జరిగిన దాడిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేవని అధికారులు వెల్లడించారు. ఈ బాంబు దాడులను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రభుత్వం పేర్కొంది.నెతన్యాహును రెచ్చగొట్టడం మంచిది కాదని హెచ్చరించారు. దీనిపై త్వరితగతిన దర్యాప్తు చేయాలని ఆ దేశ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ ఆదేశాలు జారీ చేశారు.
