Ayodhya:హిందువుల పవిత్ర ఆలయమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య రామాలయం భక్తుల కొంగుబంగారంగా వెలసిల్లుతున్నది. అతి కొద్దికాలంలోనే కోట్లాది మంది భక్తులు ఆ ఆలయాన్ని దర్శించుకోవడం విశేషం. ఇప్పటికే సాయిబాబా ఆలయం, తిరుపతి ఆలయాలు అత్యధిక సంఖ్యలో ఆధ్యాత్మిక స్థలాలుగా మన దేశంలో గుర్తింపు ఉన్నది. అదే విధంగా ప్రపంచ వింతగా భాసిల్లుతున్న తాజ్‌మహాల్ దేశంలోనే టాప్ దర్శనీయ స్థలంగా ప్రాముఖ్యత ఉన్నది. వాటన్నింటినీ మించి అయోధ్య రికార్డు సృష్టించింది.
Ayodhya:2024 జనవరి నుంచి గత సెప్టెంబర్ వరకు 13.55 కోట్ల మంది భారతీయులు అయోధ్యను సందర్శించినట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. వీరితోపాటు 3153 మంది విదేశీ పర్యాటకులు అయోధ్యను సందర్శించారని తెలిపింది. 9 నెలల్లోనే రికార్డు స్థాయిలో ఇంత జనం రావడం భారతదేశంలోనే పెద్ద రికార్డుగా విశ్లేషకులు చెప్తున్నారు.
Ayodhya:అదే ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులు కలిపి 12.51 కోట్ల మంది సందర్శించినట్టు వెల్లడించింది. ప్రతి ఏటా కోట్లాది మంది సందర్శించే తాజ్‌మహల్‌ను అయోధ్య రామమందిరం మించినట్టు తేలింది. దీంతో భారతదేశంలో అత్యధిక సంఖ్యలో దర్శనీయ స్థలం ఏది అంటే ఇక నుంచి అయోధ్య అని చెప్పుకోవాలి మరి.

