India

India: టీమిండియాకు బిగ్ షాక్.. కీలక ఆటగాడికి గాయం !

India: ఆసియా కప్ 2025లో పాకిస్తాన్‌తో జరిగే కీలకమైన సూపర్-4 మ్యాచ్‌కు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ తలకు గాయమైంది. ఈ గాయం కారణంగా పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో అతను ఆడతాడా లేదా అనేదానిపై అనిశ్చితి నెలకొంది. ఈ గాయం ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు జరిగింది. ఒమన్ బ్యాటర్ కొట్టిన బంతిని క్యాచ్ పట్టే ప్రయత్నంలో అక్షర్ పటేల్ కింద పడి తలకు గాయం చేసుకున్నాడు. దాంతో అతను మైదానాన్ని వీడాల్సి వచ్చింది. మ్యాచ్ అనంతరం భారత ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ మాట్లాడుతూ.. అక్షర్ పటేల్ బాగానే ఉన్నారని తెలిపారు. కానీ పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో అతను ఆడతాడా లేదా అనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.

ఇది కూడా చదవండి: Lakshmi Manchu: ఇదేం దిక్కుమాలిన ప్ర‌శ్న‌.. ఫిల్మ్ జ‌ర్న‌లిస్టుపై న‌టి మంచు ల‌క్ష్మి ఫిర్యాదు..

అక్షర్ పటేల్ జట్టులో కీలకమైన ఆటగాడు. బౌలింగ్, బ్యాటింగ్‌లో జట్టుకు సమతూకం ఇస్తాడు. ఒకవేళ అతను పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌కు దూరమైతే అది టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది. అప్పుడు అతని స్థానంలో రియాన్ పరాగ్ లేదా వాషింగ్టన్ సుందర్ వంటి ఆటగాళ్లను తీసుకునే అవకాశం ఉంది. అక్షర్ పటేల్ గాయంపై అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే. మరోవైపు ఒమన్‌పై టీమ్ ఇండియా 21 రన్స్ తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 188/8 పరుగులు చేసింది. శాంసన్(56) రాణించారు. ఒమన్ బౌలర్లలో ఫైసల్, జితెన్, కలీమ్‌ తలో 2 వికెట్లు తీశారు. ఒమన్ 20 ఓవర్లలో 167/4 రన్స్ చేసింది. కలీమ్(64), మీర్జా(51), జితేందర్(32) మెప్పించారు. హర్షిత్ రాణా, కుల్దీప్‌, హార్దిక్, అర్షదీప్‌లు తలో వికెట్ తీశారు. అద్భుత ప్రదర్శనతో ఒమన్ హృదయాలు గెలిచింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *