Viral News: ఒకవైపు మహిళల భద్రత కోసం ఎన్ని కఠిన చట్టాలు అమలు చేస్తున్నా, మరోవైపు వేధింపులు, అఘాయిత్యాలు ఆగడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో జరిగిన ఒక అమానవీయ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. అత్యంత దిగ్భ్రాంతికరంగా, ఫుల్లుగా మద్యం సేవించిన (తప్పతాగిన) ఓ యువతి నడిరోడ్డుపై “నన్ను రేప్ చేయండి” అంటూ నానా రచ్చ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింటా వైరల్‌గా మారి, దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
రోడ్లపై రచ్చ.. వాహనదారులకు ఇబ్బందులు
సమాచారం ప్రకారం, రిషికేశ్‌లో కొందరు యువతీ యువకులు రోడ్లపైకి వచ్చారు. వీరంతా పీకల దాకా మద్యం సేవించి ఉన్నారు. మద్యం మత్తులో వీరు రోడ్డుపై వాహనాలను అడ్డగించి, సెల్ఫీలు తీసుకుందాం అంటూ హల్చల్ చేస్తూ ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేశారు.
ఇది కూడా చదవండి: Crime News: రూ.2 వేల కోసం హత్యచేసిండు.. రెండేళ్ల తర్వాత పోలీసులకు చిక్కిండు!
అయితే, ఈ గందరగోళం మధ్య ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆ గుంపులోని ఓ యువతి అకస్మాత్తుగా రెచ్చిపోయింది. ‘నన్ను రేప్ చేయండి’ అంటూ నోటికొచ్చినట్లు అరుస్తూ, భయానక వాతావరణాన్ని సృష్టించింది. పక్కనే ఉన్న యువతీ యువకులు ఆమెను ఆపేందుకు, అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
దిగ్భ్రాంతికి గురైన స్థానికులు
ఆ బహిరంగ ప్రదేశంలో యువతి వ్యవహరించిన తీరు చూసి స్థానికులు, వాహనదారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొనడంతో, వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మద్యం మత్తులో రచ్చ చేస్తున్న ఆ యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
‘ఫ్రీడమ్’ పేరిట దారితప్పుతున్న యువత
ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఫ్రీడం’ (స్వేచ్ఛ) పేరుతో నేటి యువత దారితప్పుతున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నడిరోడ్డుపై పదుగురి ముందు ఇలాంటి అమానవీయ పదజాలాన్ని ఉపయోగించడం, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం సరికాదంటూ రకరకాల కామెంట్లు పెడుతూ నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రజా జీవనంలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా, యువతను బాధ్యతాయుతంగా ఉండేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ఉదంతం మరోసారి స్పష్టం చేసింది.
उत्तराखंड की आध्यात्मिक नगरी ऋषिकेश की शांत सड़कों पर देर रात उस समय हंगामा मच गया जब कुछ युवक-युवतियों ने शराब के नशे में जमकर उत्पात मचाया। नशे में धुत ये युवा सड़कों पर डांस करते, शोर मचाते और वाहनों को रोककर सेल्फी लेते दिखाई दिए।
और फिर शुरू हुआ हंगामा नॉन-स्टॉप!
मैडम,… pic.twitter.com/zKLHYsIPsb
— TRUE STORY (@TrueStoryUP) October 19, 2025