AVS Special: జర్నలిజమ్ లో తొలుత కలం పట్టుకొని పరుగు తీసిన ఏవీయిస్ తరువాత చిత్రసీమలో నటునిగా అలరించారు. హాస్యపాత్రల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు ఏవీయస్. బాపు ‘మిస్టర్ పెళ్ళాం’తో నటునిగా గుర్తింపు సంపాదించిన ఏవీయస్ ఆ పై అనేక చిత్రాలలో వైవిధ్యమైన పాత్రల్లో నవ్వులు పూయించారు.
ఇది కూడా చదవండి: Union Cabinet: రైతులకు కేంద్ర క్యాబినెట్ శుభవార్త!
AVS Special:నటునిగానే కాదు రచయితగా, దర్శకునిగా, నిర్మాతగానూ సాగారు ఏవీయస్. టాలీవుడ్ లో అందరివాడుగా సాగిన ఏవీయస్ నేడు భౌతికంగా లేకపోయినా, అందరి మనసుల్లోనూ నిలచే ఉన్నారు. జనవరి 2న ఏవీయస్ జయంతి… ఈ సందర్భంగా ఏవీయస్ ను గుర్తు చేసుకొనేవారెందరో ఉన్నారు.
చిందులేయించిన చిన్నికృష్ణ కథలు!
Chinni Krishna: చిత్రసీమలో టాప్ స్టార్స్ అనగానే బాలకృష్ణ, చిరంజీవి ముందుగా గుర్తుకు వస్తారు. వారిద్దరికీ వరుసగా బ్లాక్ బస్టర్స్ అందించిన కథకుడుగా చిన్నికృష్ణ నిలచిపోయారు. 2001లో బాలకృష్ణకు ‘నరసింహనాయుడు’ కథను రూపొందించి మంచి పేరు సంపాదించారు చిన్నికృష్ణ. అంతకుముందు రజనీకాంత్ ‘నరసింహ’కు కూడా చిన్నికృష్ణ రచన చేశారు. 2001లో బ్లాక్ బస్టర్ హిట్ గా ‘నరసింహనాయుడు’ నిలచింది. ఆ తరువాత సంవత్సరమే చిరంజీవి ‘ఇంద్ర’కు కూడా కథ సమకూర్చారు చిన్నికృష్ణ. ఆ సినిమా కూడా బంపర్ హిట్ అయింది.
Chinni Krishna: 2002 బ్లాక్ బస్టర్ గా ‘ఇంద్ర’ మిగిలింది. ఇక అల్లు అర్జున్ తొలి చిత్రం ‘గంగోత్రి’కి కూడా చిన్నికృష్ణనే కథకుడు. ఇలా తెలుగు చిత్రసీమలో చిన్నికృష్ణ కథలు చిందులు వేయించాయి. ఆ మధ్య దర్శకత్వంపై మోజు పెంచుకున్నారు చిన్నికృష్ణ. జనవరి 2న చిన్నికృష్ణ బర్త్ డే. ఈ పుట్టినరోజు తరువాత చిన్నికృష్ణ మెగాఫోన్ పడతారేమో చూద్దాం.