Viral Video: కొందరు ప్రేమికులు ఎక్కడ ఎలా ఉండాలో కనీస అవగాహన లేకుండా బహిరంగ ప్రదేశాల్లో అసహ్యకరమైన ప్రవర్తన చూపుతారు. ముఖ్యంగా ప్రియురాలిని బైక్‌పై కూర్చోబెట్టుకుని పెదవులపై ముద్దులు పెడుతూ జాలీ రైడ్‌కు వెళ్లే వారిని ఎన్నోసార్లు సోషల్ మీడియా వీడియోల్లో చూశాం. ఇలాంటి విపరీతమైన ప్రవర్తన నెటిజన్ల నుంచి తరచూ తీవ్రమైన వ్యతిరేక కామెంట్స్ కు అవకాశం ఇస్తూవస్తోంది. నెటిజన్లు ఇలా ప్రవర్తించిన వారిని తమ కామెంట్స్ లో హెచ్చరించడం.. నిందించడం జరుగుతుంది. కానీ, కొంతమందిలో మార్పు ఉండదు. ఇదిగో ఇప్పుడు ఇదే తరహాలో ఓ యువకుడు ట్రాఫిక్ రూల్స్ మరిచి తన ప్రియురాలిని ఒడిలో కూర్చోబెట్టుకుని లిప్ లాక్ చేస్తూ బాధ్యతారహితంగా కారు నడిపిన వీడియో వైరల్ గా మారింది. ఈ దృశ్యం ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతోంది.
ఓ యువకుడు ట్రాఫిక్ నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కి తన ప్రియురాలిని ఒడిలో కూర్చోబెట్టుకుని లిప్ లాక్ చేస్తూ రొమాన్స్ చేస్తూ బాధ్యతారహితంగా డ్రైవింగ్ చేశాడు. దీని గురించిన వీడియోను సూర్య రెడ్డి (జసూర్యరెడ్డి) తన X ఖాతాలో పంచుకున్నారు. “షాకింగ్ సీన్, అతను తనతో పాటు ఇతరుల ప్రాణాలను పణంగా పెట్టాడు” అని క్యాప్షన్ ఇచ్చాడు.
ఈ వైరల్ వీడియోలో, ఒక యువకుడు తన ప్రియురాలిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని, ఆమెతో పెదాలు లాక్కుంటూ కారు నడుపుతున్న దృశ్యాన్ని చూడవచ్చు.
Where are we going?
Shocking video, with him risking the lives of others also.
What punishment does he need?#RoadSafety #viralvideo #ViralVideos pic.twitter.com/ZTWa7B5fB7— Surya Reddy (@jsuryareddy) December 26, 2024
Viral Video: డిసెంబర్ 26న షేర్ చేయబడిన ఈ వీడియో 45,000 వ్యూస్ సొంతం చేసుకుంది. చాలా కామెంట్‌లు కూడా వచ్చాయి. ఒక యూజర్ “యువకులు తమ తల్లిదండ్రుల గురించి అస్సలు ఆలోచించకుండా ఎందుకు ఇలా ప్రవర్తిస్తారు” అని కామెంట్ రాశారు.
ఇతరుల ప్రాణాలను పణంగా పెట్టి రూఫ్‌కింద కారు నడిపిన అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మరో వినియోగదారు డిమాండ్ చేశారు.
ఇలాంటి వారికి ట్రాఫిక్ పోలీసులు కఠినమైన శిక్ష పడేలా చేయాలని కొందరు డిమాండ్ చేశారు.
ఇలాంటి పనుల వలన వారికి కిక్ వస్తుందేమో కానీ, ఏదైనా జరగకూడనిది జరిగితే.. వారి తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుంది? అలానే రోడ్డు మీద వెళ్లే వారికీ ఏదైనా జరిగితే అప్పుడు పరిస్థితి ఏమిటీ అని చాలామంది కామెంట్ చేశారు.