Avatar 3

Avatar 3: ఇండియాలో విడుదలకు ముందే అవతార్ 3 భారీ రికార్డ్?

Avatar 3: హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ‘అవతార్: ఫైర్ అండ్ ఆష్’తో మళ్లీ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే వచ్చిన రెండు చిత్రాలు భారత్‌లో భారీ వసూళ్లు సాధించాయి. ఇప్పుడు మూడో భాగం కోసం దేశవ్యాప్తంగా అపూర్వ ఆసక్తి నెలకొంది.

Also Read: K-Ramp: కె-ర్యాంప్.. ఓటీటీలో రాకెట్ రికార్డ్!

హాలీవుడ్ టాప్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వస్తున్న ‘అవతార్: ఫైర్ అండ్ ఆష్’ పై మాములు అంచనాలు లేవు. ఈ సినిమా డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇంగ్లీష్, హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రం ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. టీజర్, ట్రైలర్‌లు ప్రేక్షకుల్లో అంచనాలను రెట్టింపు చేశాయి. ప్రముఖ ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ బుక్‌మైషోలో ఈ చిత్రం కోసం ఏకంగా 12 లక్షల మంది ఆసక్తి చూపినట్టు తెలుస్తోంది. ఇది భారత్‌లో ఈ స్థాయి ఆసక్తి చూపిన తొలి హాలీవుడ్ చిత్రంగా రికార్డు సృష్టించింది. మునుపటి రెండు భాగాలు కూడా ఇండియాలో భారీ వసూళ్లు రాబట్టాయి. ఈ నేపథ్యంలో మూడో భాగం కూడా బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డులు సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *