Avanti Srinivas: పార్టీ అంటే ప్రజాస్వామ్య బద్ధంగా ఉండాలి

Avanti Srinivas: ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలని వైఎస్ జగన్‌కు అవంతి శ్రీనివాస్ సూచించారు. ఐదేండ్లు పాలించాలని కూటమికి రాష్ట్ర ప్రజలు తీర్పు చెబితే కనీసం ఐదు నెలలు కూడా టైం ఇవ్వకుండా ధర్నాలు అంటే ఎలా అని ప్రశ్నించారు. పార్టీ అంటే ప్రజాస్వామ్య బద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. గత ఐదేండ్లు పార్టీ కార్యకర్తలు నలిగిపోయారన్నారు. తాడేపల్లిలో కూర్చుని ఆయన (జగన్) ఆదేశాలిస్తే.. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఇబ్బంది పడ్డారని పేర్కొన్నారు.

కాగా,మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్, పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త విజయసాయిరెడ్డికి పంపానన్నారు.

2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరిన అవంతి శ్రీనివాస్‌.. భీమిలి నుంచి పోటీచేసి విజయం సాధించారు. అనంతరం చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశాక ఆ పార్టీలో కొనసాగారు. అయితే రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన.. 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. అయితే 2109 ఎన్నికల సమయంలో టీడీపీకి గుడ్‌బై చెప్పారు. వైసీపీలో చేరిన ఆయన భీమిలి నుంచి పోటీచేసి టీడీపీ అభ్యర్థి సబ్బం హరిపై గెలుపొందారు. ఆ తర్వాత జగన్ కేబినెట్‌లో రెండున్నరేండ్ల మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున భీమిలి నుంచి పోటీచేసి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు చేతిలో ఓడిపోయారు. ఈనేపథ్యంలో మరోసారి పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *