Jasprit Bumrah: ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా మూడో టెస్టు సిరీస్ విజయమే లక్ష్యంగా అడుగుపెడుతున్న టీమిండియాను నిలువరించే లక్ష్యంగా కంగారూ జట్టు పావులు కదుపుతోంది. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భారత్ జట్టుకు కీలకమైన జస్‌ప్రీత్ బుమ్రాను కట్టడి చేస్తే విజయం వస్తుందని భావిస్తోంది. అతడి ప్రదర్శన పైనే టీమ్‌ఇండియా విజయావకాశాలు కూడా ఆధారపడి ఉన్న నేపథ్యంలో కంగారూ వ్యూహాలపై ఆసక్తి నెలకొంది.
Jasprit Bumrah: బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ ఇటు భారత్‌తోపాటు అటు ఆస్ట్రేలియాకు అత్యంత కీలకంగా మారింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకోవాలంటే సిరీస్ విజయంతోపాటు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకూడదు. దీంతో ఈ సిరీస్‌లో అందరి దృష్టి బుమ్రాపైనే ఉంది. అతడిని అడ్డుకోవడంపైనే ఆసీస్ అవకాశాలు ఆధారపడి ఉండగా.. టీమిండియా గెలవాలన్నా బుమ్రా రాణించాల్సింది. ఈక్రమంలో బుమ్రాను కట్టడి చేసేందుకు ఆస్ట్రేలియా ఓ మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. టెస్టు షెడ్యూల్ చూస్తే అలానే అర్థమయ్యేలా కనిపిస్తోంది. పెర్త్ వేదికగా జరిగే మ్యాచ్‌లో వేడి దెబ్బకు బుమ్రా ఉడికిపోయేలా ప్రణాళికలను రూపొందించినట్లు తెలుస్తోంది. సాధారణంగా అతడే ఎక్కువ ఓవర్లు వేయాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: IPL 2025: ఐపీఎల్ మెగా వేలంలో భారత క్రికెటర్లపై ఈసారి కాసుల వర్షం
Jasprit Bumrah: కానీ, అక్కడి పరిస్థితులు అందుకు సహకరించవు. అందుకే అతన్ని తొలిటెస్టులోనే అలిసిపోయేలా చేసేందుకు షెడ్యూల్ చేసినట్లుగా కనిపిస్తోంది. ఆ తర్వాత వరుసగా అడిలైడ్ , బ్రిస్బేన్ లోనూ బుమ్రాపై భారం పడేలా మ్యాచ్ లను షెడ్యూల్ చేశారు. ఈ మ్యాచ్ లలో ఇతర బౌలర్ల నుంచి సహకారం లేకపోతే మాత్రం బుమ్రా పైనే ఎక్కువ భారం పడనుంది. ప్రతి మ్యాచ్‌లో బుమ్రానే ఎక్కువ ఓవర్లు వేయాల్సి ఉంటుంది. భారత జట్టులో బుమ్రా కాకుండా మిగతా పేసర్ల పరిస్థితి అంతర్జాతీయ స్థాయిలో ఎక్కువ అనుభవం లేకపోవడం కాస్త ఇబ్బందికరంగా మారనుంది. షమీ ఉండుంటే టీమిండియాను అడ్డుకోవడం ఆసీస్‌కు కష్టంగా మారేది. ఆస్ట్రేలియాలో భారత గత రెండు సిరీస్‌లను గెలవడంలో బుమ్రా కీలక భాగస్వామి. ఆసీస్‌లో 7 టెస్టులు ఆడిన బుమ్రా 32 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒకసారి ఐదు వికెట్ల ప్రదర్శన ఉంది. 2018లోనే 33 పరుగులకు 6 వికెట్లు తీసుకుని అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు. ఒకే మ్యాచ్‌లో తొమ్మిది వికెట్లు తీసిన ఘనతను బుమ్రా సొంతం చేసుకున్నాడు.

